వరదానము: మనసు - బుద్ధిని ఆర్డర్ అనుసారంగా విధిపూర్వకముగా కార్యములో వినియోగించే నిరంతరయోగీ భవ.
విస్తారము: నిరంతరయోగిగా అనగా స్వరాజ్యాధికారిగా అయ్యేందుకు విశేష సాధనము - మనసు మరియు బుద్ధి, మంత్రము కూడా మన్మనాభవ అనే ఉంది. యోగమును బుద్ధియోగము అని అంటారు. కావున ఒకవేళ ఈ విశేష ఆధార స్తంభము మీ అధికారములో ఉన్నట్లైతే అనగా ఆర్డర్ అనుసారముగా ఉన్నట్లైతే విధిపూర్వకముగా కార్యముచేస్తారు. ఏ సంకల్పమును ఎప్పుడు చేయాలనుకుంటే అలా అప్పుడే చెయ్యగలగాలి. బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలగాలి. రాజు అయిన మిమ్మల్ని బుద్ధి భ్రమింపచేయకూడదు. విధిపూర్వకముగా కార్యమును చెయ్యాలి. అప్పుడే నిరంతరయోగులు అంటారు.
స్లోగన్: మాస్టర్ విశ్వశిక్షకులుగా అవ్వండి, సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి.
No comments:
Post a Comment