మధురమైన పిల్లలూ - మాయా రావణుని సాంగత్యములోకి వచ్చి మీరు తప్పిపోయారు. పవిత్రమైన మొక్కలు అపవిత్రముగా అయిపోయాయి. ఇప్పుడిక మళ్ళీ పవిత్రంగా అవ్వండి.
ప్రశ్న: పిల్లలు ప్రతి ఒక్కరికీ తమపై తమకు ఏ ఆశ్చర్యము కలుగుతుంది? మరియు తండ్రికి పిల్లలపై ఏ ఆశ్చర్యము కలుగుతుంది?
జవాబు: మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్క్లలుగా ఉండేవారము, ఎటువంటి తండ్రి వారసత్వము మాకు లభించింది, ఆ తండ్రినే మేము మరచిపోయామే! అని పిల్లలకు ఆశ్చర్యమనిపిస్తుంది. రావణుడు వచ్చాడు, దానితో ఎంత పొగ మంచు వచ్చేసిందంటే, దానితో రచయిత మరియు రచనను అంతటినీ మరచిపోయాము. ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతముగా చేశానో, రాజ్యభాగ్యమును ఇచ్చానో ఆ పిల్లలే నన్ను గ్లాని చేశారు! రావణుని సాంగత్యములోకి వచ్చి అన్నిటినీ పోగొట్టుకున్నారు అని బాబాకు ఆశ్చర్యమనిపిస్తుంది.
ఓంశాంతి.
ధారణ కొరకు ముఖ్యసారము:
1. శివాలయములోకి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించాలి. ఈ వేశ్యాలయము నుండి మీ మనసును తప్పించుకుంటూ ఉండాలి. శూద్రుల సాంగత్యము నుండి తప్పుకోవాలి.
2. ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావిస్తూ ఏమీ ఆలోచించకూడదు. ఎప్పుడూ అహంకారములోకి రాకూడదు. ఎప్పుడైనా శిక్షణ లభిస్తే అలజడి అయిపోకూడదు.
వరదానము: ఒక స్థానములో ఉంటూ అనేక ఆత్మల సేవను చేసే లైట్ - మైట్ సంపన్నభవ.
స్లోగన్: ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు మైట్ (శక్తి స్వరూపులు)గా అవ్వండి మరియు ఇతర ఆత్మలను మైకులుగా తయారుచేయండి.
No comments:
Post a Comment