Friday, August 21, 2009

కళ్ళు మూసుకొని కూర్చోవడం నుండి మిమ్మల్ని ఎందుకు అవరోధించడం జరుగుతుంది?

"మధురమైన పిల్లలూ - చైతన్య అవస్థలో ఉంటూ బాబాను స్మృతి చేయాలి, స్తబ్ధావస్తలోకి వెళ్ళిపోవడము లేక నిదురపోవడం యోగం కాదు."

ప్రశ్న: కళ్ళు మూసుకొని కూర్చోవడం నుండి మిమ్మల్ని ఎందుకు అవరోధించడం జరుగుతుంది?

జవాబు: మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నట్లయితే దుకాణములోని సామానంతటినీ దొంగలు దోచుకుపోతారు. మాయారూపీ దొంగ బుద్ధిలో ఏమీ ధారణ అవ్వనివ్వదు. కళ్ళు మూసుకొని యోగములో కూర్చున్నట్లయితే నిదురవచ్చేస్తుంది, ఏమీ తెలియదు. కావున కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. అన్ని పనులు చేసుకుంటూ బుద్ధి ద్వారా బాబాను స్మృతి చేయాలి. ఇందులో హఠయోగపు విషయము లేదు.

ధారణ:
1. గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ బుద్ధియోగాన్ని తండ్రితో ఉంచాలి, పొరపాటు చేయకూడదు పవిత్రతా ధారణతో స్వ మరియు సర్వుల కళ్యాణమునూ చేయాలి.

2. స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది. ధ్యానము, సాక్షాత్కారములు మొదలైనవి భ్రమించడం మాత్రమే. కావున వాటివల్ల ఎటువంటి లాభమూ లేదు. ఎంత వీలైతే అంత సుజాగృతులుగా అయి బాబాను స్మృతిచేస్తూ మీ వికర్మలను వినాశనం చేసుకోవాలి.

వరదానము: సహచరుడిని సదా తోడుగా ఉంచుకొని సహయోగమును అనుభవము చేసుకొనే కంభైండ్ రూపధారీ భవ.

"నేను మరియు బాబా" ఎవ్వరూ విడదీయలేనంతగా సదా ఇలా కంభైండ్ గా ఉండండి. ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా భావించకండి. అవినాశీ తోడును నిర్వర్తించే బాప్ దాదా మీ అందరి సహచరుడు. 'బాబా' అని అనగానే, బాబా హాజిరైపోతారు. మేము బాబావారిమి, బాబా మా వారు. బాబా మీ ప్రతి సేవలో సహయొగమును ఇస్తారు, కేవలము మీ కంభైండు స్వరూపపు ఆత్మిక నషాలో ఉండండి.

స్లొగన్: సేవ మరియు స్వ ఉన్నతి, ఈ రెండింటి బాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment