"మధురమైన పిల్లలూ - మీరు చైతన్యమైన లైట్ హౌస్ లు, మీరు అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వాలి, ఇంటి దారిని తెలియచేయాలి."
ప్రశ్న: ముందు, ముందు ఏ డైరెక్షన్ అనేక ఆత్మలకు లభించనున్నది? మరియు అది ఏ విధి ద్వారా లభించనున్నది?
జవాబు: ముందు ముందు అనేకులకు మీరు బ్రహ్మకుమారీ, కుమారుల వద్దకు వెళ్ళండి, వారు మీకు వైకుంఠపు యువరాజులుగా అయ్యే జ్ఞానమును ఇస్తారు అని ఎంతోమందికి డైరెక్షన్ లభిస్తుంది. ఈ డైరెక్షన్ వారికి బ్రహ్మ సాక్షాత్కారము ద్వారా లభిస్తుంది. ఎక్కువగా బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారమే జరుగుతుంది, ఏ విధముగా ఆదిలో సాక్షాత్కారపు పాత్ర నడిచిందో, అలాగే అంతిమంలో కూడా నడువనున్నది.
ధారణ:
1. తండ్రి స్మృతితోపాటు సంతోషములో ఉండేందుకు 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతిచేయాలి, స్వదర్శనచక్రాన్ని తిప్పాలి, ఖుదాను మీ సత్యమైన దోస్త్ గా చేసుకోవాలి.
2. డబుల్ అహింసకులుగా అయ్యేందుకు అశుద్ధ దృష్టిని తొలగించుకొని దృష్టిని శుద్ధముగా చేసుకోవాలి. ఆత్మలమైన మనం సోదరులము అన్న అభ్యాసము చేయాలి.
వరదానము: బ్రాహ్మణ జీవితములో ఏకవ్రత పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ.
ఈ బ్రాహ్మణ జీవితములో ఏకవ్రత పాఠమును దృడం చేసుకొని ప్యురిటీ యొక్క రాయల్టీని ధారణ చేసినట్లయితే మొత్తము కల్పములో ఈ ఆత్మిక రాయల్టీ నడూస్తూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు ప్యురిటీ ప్రకాశము పరంధామములోని సర్వ ఆత్మలలోకీ శ్రేష్టము. ఆదికాలపు దేవతా స్వరూపములో కూడా ఈ పర్సనాలిటీ విశేషంగా ఉండేది, మళ్ళీ మధ్య కాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఈ సంగమయుగములో బ్రాహ్మణ జీవనమునకు ఆధారము ప్యురిటీ యొక్క రాయల్టీ. కావున ఎంతవరకు బ్రాహ్మణ జీవితమును జీవిస్తారో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండవలసిందే.
స్లొగన్: మీరు సహనశీలతా దేవతలుగా అయినట్లయితే తిట్టేవారు కూడా ప్రేమిస్తారు
No comments:
Post a Comment