Saturday, August 22, 2009

భక్తి మార్గములో ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడని ఏ అలవాటు ఉంటుంది?

"మధురమైన పిల్లలూ - మీరు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చారు, మీరు కళ్ళు మూసుకోవలసిన అవసరం లేదు, చదువును కళ్ళు తెరుచుకొనే చదువుకోవడం జరుగుతుంది."

ప్రశ్న: భక్తి మార్గములో ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడని ఏ అలవాటు ఉంటుంది?

జవాబు: భక్తులలో ఏ దేవత ముందుకు వెళ్ళినా వారిని ఏదో ఒకటి అడిగే అలవాటు ఉంటుంది. వారిలో అలా యాచించే అలవాటు ఏర్పడిపోతుంది. లక్ష్మి ముందుకు వెళితే ధనం అడుగుతారు, కానీ ఏమీ లభించదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ అలవాటు లేదు. మీరైతే బాబా వారసత్వానికి అధికారులు. మీరు సత్యమైన, విచిత్రుడైన బాబాను చూస్తూ ఉండండి, ఇందులోనే మీ సత్యమైన సంపాదన ఉంది.

ధారణ:
1. బాబా ఏ జ్ఞాన సింగారమునైతే చేస్తారో దానిని సదా నిలుపుకునే పురుషార్ధం చేయాలి. మాయ ధునిలో జ్ఞాన సింగారమును పాడుచేసుకోకూడదు, చదువును బాగా చదువుకొని అవినాశీ సంపాదన చేసుకోవాలి.

2. ఈ చిత్రమును అనగా దేహధారిని మీ ముందు చూస్తూ బుద్ధి ద్వారా విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చొనే అలవాటు చేసుకోకూడదు. అనంతమైన తండ్రిని ఏమీ అడుక్కోకూడదు.

వరదానం: తండ్రి చత్రచాయలో సదా ఆనందమును అనుభవము చేసుకొనే మరియు చేయించే విశేష ఆత్మా భవ.

ఎక్కడ తండ్రి చత్రచాయ ఉంటుందో అక్కడ సదా మాయ నుండి రక్షణ ఉంటుంది. చత్రచాయలోపలకు మాయ రాజాలదు. శ్రమనుండి స్వతహాగనే దూరమైపోతారు, ఆనందములో ఉంటారు. ఎందుకంటే శ్రమ ఆనందమును అనుభవము చేయ్యనివ్వదు. ఛత్రచాయలో ఉండే ఇటువంటి విశేష ఆత్మలు ఉన్నతమైన చదువును చదువుతూ కూడా ఆనందములో ఉంటారు, ఎందుకంటే మేము కల్పకల్పపు విజయులము, పాస్ అయ్యి తీరుతాము అన్న నిశ్చయము వారికి ఉంటుంది. కావున సదా ఆనందములో ఉండండి మరియు ఇతరులకు ఆనందములో ఉండే సందేశమును ఇస్తూ ఉండండి, ఇదే సేవ.

స్లొగన్: ఎవరైతే డ్రామా రాజ్(రహస్యము)ను తెలుసుకోరో వారే నారాజ్(అసంతుష్టు)లుగా అవుతారు.

No comments:

Post a Comment