Tuesday, August 25, 2009

మాయ ఏ పిల్లలను కొద్దిగా కూడా విసిగించజాలదు?

"మధురమైన పిల్లలూ - మీరు ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా ఆత్మలోకి ప్రకాశము వస్తుంది. జ్ఞానవంతమైన ఆత్మ ప్రకాశవంతంగా అయిపోతుంది."

ప్రశ్న: మాయ ఏ పిల్లలను కొద్దిగా కూడా విసిగించజాలదు?

జవాబు: ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో, ఎవరైతే యోగబలం ద్వారా తమ సర్వ కర్మేంద్రియాలను శీతలముగా చేసుకున్నారో, ఎవరైతే యోగములో ఉండేందుకే ప్రయత్నిస్తూ ఉంటారో వారిని మాయ కొద్దిగా కూడా విసిగించజాలదు. ఎప్పుడైతే మీరు పక్కా యోగులుగా అయిపోతారో అప్పుడు అర్హులుగా అవుతారు. అర్హులుగా అయ్యేందుకు పవిత్రత ప్రధానమైనది.

ధారణ:
1. ఇప్పుడు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు స్మృతి శక్తి ద్వారా ఆత్మను పవిత్రముగా తయారుచేసుకోవాలి, కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలనూ చేయకూడదు.

2. జ్ఞానవంతులుగా అయి ఆత్మలను సుజాగృతులను చేసే సేవను చేయాలి, ఆత్మరూపీ జ్యొతిలో జ్ఞానయోగాలనే నూనెను పోయాలి, శ్రీమతం ద్వారా బుద్ధిని స్వచ్చముగా తయారుచేసుకోవాలి.

వరదానము: విశ్వములో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజమును నాటే విశ్వ సేవాధారీ భవ.

విశ్వసేవాధారీ పిల్లలైన మీరు విశ్వములో ఈశ్వరీయ పరివారపు స్నేహమనే బీజమును నాటుతున్నారు. వారు నాస్తికులైనా గానీ లేక ఆస్తికులైనా గానీ .... అందరికీ అలౌకిక మరియు ఈశ్వరీయ స్నేహపు, నిస్వార్ధ స్నేహపు అనుభూతిని కలిగించటమే బీజమును నాటడము. ఈ బీజము సహయోగిగా అయ్యే వృక్షముగా స్వతహాగనే పెరుగుతుంది మరియు అవసరమైన సమయములో సహజయోగిగా అయ్యే ఫలాలు కనిపిస్తాయి. కాకపోతే కేవలము, కొన్ని ఫలాలు త్వరగా వస్తే కొన్ని ఫలాలు సమయములో వెలువడుతాయి.

స్లొగన్: భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకోవటము, గుర్తించటము మరియు వారి డైరెక్ట్ పిల్లలుగా అవ్వటము - ఇది అన్నింటికన్నా పెద్ద భాగ్యము.

No comments:

Post a Comment