Friday, July 31, 2009

మీ అన్ని కార్యాలు ఏ ఆధారముపై సఫలమవ్వగలవు? పేరు ఏ విధముగా ప్రఖ్యాతమవుతుంది?

"మధురమైన పిల్లలూ - రక్షాబంధన పండుగ ప్రతిజ్ఞ చేసే పండుగ, ఇది సంగమయుగమునుండే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు పవిత్రముగా అయ్యే మరియు తయారుచేసే ప్రతిజ్ఞను చేస్తారు."

ప్రశ్న: మీ అన్ని కార్యాలు ఏ ఆధారముపై సఫలమవ్వగలవు? పేరు ఏ విధముగా ప్రఖ్యాతమవుతుంది?

జవాబు: జ్ఞానబలముతో పాటు యోగ బలము కూడా ఉండాలి. అప్పుడు అన్ని కార్యాలు వాటంతట అవే చేసేందుకు సిద్ధమవుతాయి. యోగము చాలా గుప్తమైనది. దీని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. యోగములో ఉంటూ అర్ధం చేయించినట్లయితే వార్తాపత్రికలవారు తమకు తామే మీ సందేశమును ముద్రిస్తారు. వార్తాపత్రికలద్వారానే పేరు ప్రఖ్యాతమవనున్నది. దీనిద్వారానే అనేకులకు సందేశము లభిస్తుంది.

ధారణ:
1. పాస్ విత్ హానర్లుగా అయ్యేందుకు బాబా సమానముగా, జ్ఞానసాగరులుగా అవ్వాలి. ఏదైనా అవగుణము లోపల ఉన్నట్లయితే దానిని పరిశీలించుకొని తొలగించుకోవాలి. శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా ఆత్మను నిశ్చయం చేసుకొని ఆత్మతోనే మాట్లాడాలి.

2. మీ ప్రతి పనీ సహజముగా అయిపోయేంతటి యోగబలమును జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా అందరికీ పావనంగా అయ్యే సందేశమును ఇవ్వాలి. మీ సమానముగా తయారుచేసే సేవను చేయాలి.

పాతదేహపు మరియు ప్రపంచపు సర్వ ఆకర్షణలనుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజఋషీ భవ.

రాజఋషి అనగా ఒకవైపు సర్వప్రాప్తుల అధికారపు నషా మరియు మరొకవైపు అనంతమైన వైరాగ్యపు అలౌకిక నషా. వర్తమాన సమయములో ఈ రెండు అభ్యాసాలను పెంచుకుంటూ వెళ్ళండి. వైరాగ్యము అంటే తప్పుకోవటము కాదు, సర్వ ప్రాప్తులు ఉంటూ కూడా హద్దులోని ఆకర్షణలు మనసు-బుద్ధిని ఆకర్షణలోకి తీసుకురాకూడదు. సంకల్పమాత్రముకూడా ఆధీనత ఉండకూడదు, వీరినే రాజఋషులుగ అనగా అనంతమైన వైరాగులు అని అంటారు. ఈ పాత దేహము మరియు దేహపు పాత ప్రపంచము, వ్యక్త భావము, వైభవాల భావము ఈ అన్ని ఆకర్షణలనుండి సదా మరియు సహజంగానే దూరంగా ఉండేవారిగా ఉండండి.

స్లొగన్: విజ్ఞాన సాధానాలను ఉపయోగించండి, కానీ వాటిని మీ జీవితపు ఆధారాలుగా తయారుచేసుకోకండి.

No comments:

Post a Comment