"మధురమైన పిల్లలూ - ఇప్పుడు వికర్మలు చేయడం మానుకోండి. ఎందుకనగా ఇప్పుడు మీరు వికర్మాజీత్ శకం మొదలు పెట్టాలి."
ప్రశ్న: ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లలు ఎటువంటి ఒక విషయంలో బాబాని తప్పకుండా అనుసరించాలి?
జవాబు: ఎలాగయితే బాబా స్వయం టీచర్ గ అయ్యి మనల్ని చదివిస్తారో అలానే బాబా సమానంగ ప్రతి ఒక్కరూ టీచర్ గ అవ్వాలి. ఏదైతే మీరు చదువుతారో అది మీరు ఇతరులకు కూడ చదివించాలి. మీరు టేచర్ పిల్లలు, పిల్లలు సద్గురువు పిల్లలు. మీరు సత్యమైన ఖండాన్ని స్థాపన చేయాలి. మీరు సత్యం యొక్క నావపై ఉన్నారు. మీనావ కదులుతుంది కానీ మునగదు.
ధారణ:
1. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ఉత్తమ పురుషులుగ అవ్వడానికి ఆత్మాభిమానిగ అయ్యే పురుషార్ధం చేయాలి. సత్యమైన బాబా లభించారు. కావున ఎలాంటి అసత్యమైన కర్తవ్యం చేయరాదు.
2. మాయ యొక్క తుఫాన్లకు భయపడకూడదు. ఎల్లప్పుడు గుర్తుంచుకోండి - సత్యం యొక్క నావ కదుల్తుంది, మెదుల్తుంది కాని మునగదు. సద్గురువు యొక్క పిల్లలు సద్గురువు అయ్యి అందరి యొక్క నావను ఒడ్డుకు చేర్చాలి.
వరదానం: తమ సూక్ష్మ శక్తులపైన విజయి అయ్యే వారే రాజఋషి స్వరాజ్య అధికారి ఆత్మ భవ.
కర్మేంద్రియ జీత్ అవ్వడం సహజమే కాని మనస్సు, బుద్ధి సంస్కారము ఈ సూక్ష్మ శక్తుల పైన విజయీ అవ్వడం ఇది సూక్ష్మమైన అభ్యాసం. ఏ సమయంలో ఏ సంకల్పం, ఏ సంస్కారం ఇమర్జ్ చేసుకోవాలనుకుంటారో అదే సంకల్పము, అదే సంస్కారము సహజంగ ఆచరించాలి. దీనినే అంటారు సూక్ష్మ శక్తులపైన విజయము. అనగా రాజఋషి స్థితి. ఒకవేళ సంకల్ప శక్తిని ఆర్డర్ చేయండి, ఇప్పుడిప్పుడే ఏకాగ్రచిత్తులుగ అవ్వండి. రాజు యొక్క ఆర్డర్ ఆక్షణంలో ఆరకంగ ఒప్పుకోవడం ఇదే రాజ్య అధికారి యొక్క గుర్తు. ఈ అభ్యాసం ద్వారానే అంతిమ పేపర్ లో పాస్ అవుతారు.
స్లొగన్: సేవద్వారా లభించే ఆశీర్వాదం అన్నిటికన్నా గొప్ప బహుమతి.
No comments:
Post a Comment