Thursday, July 30, 2009

బాబా పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తారు?

"మధురమైన పిల్లలూ - శాంతిధామము పావన ఆత్మల ఇల్లు, కావున ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణపావనులుగా అవ్వండి."

ప్రశన్: బాబా పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తారు?

జవాబు: మధురమైన పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే ఏ శిక్షలూ అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రముగా అయి చూపించండి అప్పుడు తండ్రి మీకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు.

ధారణ:
1. బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు పూర్తి ఫకీరులుగా అవ్వాలి. దేహాన్ని కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీరులుగా అవ్వడము. తండ్రి నుండి అతి పెద్ద కానుకను తీసుకువెళ్ళేందుకు సంపూర్ణపావనముగా అయి చూపించాలి.

2. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, కావున పాత ప్రపంచముపై మీ మనస్సు పెట్టుకోకూడదు. ఒక్క ప్రియునిపైనే మనస్సు పెట్టుకోవాలి. తండ్రిని మరియు రాజధానిని స్మృతిచేయాలి.

వరదానము: స్వరాజ్య అధికారపు నషా మరియు నిశ్చయము ద్వారా సదా శక్తిశాలిగా అయ్యే సహజయోగి, నిరంతర యోగీ భవ.

స్వరాజ్య అధికారి అనగా ప్రతి కర్మేంద్రియముపై తమ రాజ్యము, సంకల్పములోకూడా ఎప్పుడూ కర్మేంద్రియాలు మోసము చెయ్యకూడదు. ఎప్పుడైనా కొంచెమైనా దేహ అభిమానము వచ్చినట్లయితే ఆవేశము లేక క్రోధము సహజంగానే వస్తాయి, కానీ ఎవరైతే స్వరాజ్య అధికారులుగా ఉంటారో వారు సదా నిరహంకారిగా, సదా నిర్మాణులుగా అయ్యి సేవ చేస్తారు. కావున నేను స్వరాజ్య అధికారీ ఆత్మను అన్న ఈ నషా మరియు నిశ్చయముద్వారా శక్తిశాలిగ అయ్యి మాయాజీతులుగా జగజ్జీతులుగా అయినట్లయితే సహజయోగిగా, నిరంతర యోగిగా అయిపోతారు.

స్లొగన్: లైట్ హవుస్ గా అయ్యి మనసు, బుద్ధిద్వారా లైట్ ను వ్యాపింపచేయటంలో బిజీగా ఉన్నట్లయితే ఏ విషయములోనూ భయమనిపించదు.

No comments:

Post a Comment