మధురమైన పిల్లలూ - దేహాభిమానం అసురీ నడవడిక. దానిని మార్చి దైవీ నడవడికను ధారణ చేసుకున్నట్లైతే రావణుని జైలు నుండి విముక్తులైపోతారు.
ప్రశ్న: ప్రతి ఆత్మా తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది? దాని నుండి రక్షించుకునేందుకు సాధనము ఏమిటి?
జవాబు: ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో గర్భజైలులో అనుభవిస్తారు, ఇంకొకటి రావణుని జైలులో అనేకరకాలైన దు:ఖాలను పొందుతారు. పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ళ నుండి విడిపించేందుకు బాబా వచ్చారు. వీటినుండి రక్షించుకునేందుకు పవిత్రంగా అవ్వండి.
ఓంశాంతి.
ధారణ కొరకు ముఖ్యసారము:
1. ఎప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించి మీ స్థితిని పాడుచేసుకోకూడదు. లోలోపల స్వచ్ఛతను ఉంచాలి. అసత్యమైన మాటలను విని లోలోపల తగులబడకూడదు. ఈశ్వరీయ మతమును తీసుకోవాలి.
2. దేహీఅభిమానులుగా అయ్య్యేందుకు పూర్తి పురుషార్ధం చేయాలి.ఎవరినీ నిందించకూడదు. లాభము, నష్టము మరియు పరువును దృష్టిలో ఉంచుకొని అశుద్ధదృష్టిని సమాప్తం చేసేయాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒకచెవితో విని ఇంకో చెవితో తీసేయకూడదు.
వరదానము: ప్రతి శ్వాసలోనూ స్మృతి మరియు సేవల బ్యాలెన్సు ద్వారా బ్లెస్సింగులను ప్రాప్తిచేసుకొనే సదా ప్రసన్నచిత్ భవ.
స్లోగన్:తండ్రి నుండి కానుకను తీసుకోవాలనుకుంటే స్వయము మరియు సహచరుల నుండి నిర్విఘ్నముగా ఉండే సర్టిఫికెట్ తోడుగా ఉండాలి.
No comments:
Post a Comment