మధురమైన పిల్లలూ - డ్రామా యొక్క యదార్ధ ఙ్ఞానము ద్వారానే మీరు అచలముగా, స్థిరముగా మరియు ఏకరసముగా ఉండగలుగుతారు, మాయా తుఫానులు మిమ్మల్ని కదిలించజాలవు.
ప్రశ్న: దేవతల ముఖ్యమైన ఏ ఒక్క గుణము పిల్లలైన మీలో సదా కనిపిస్తూ ఉండాలి?
జవాబు: హర్షితముగా ఉండడం. దేవతలను సదా చిరునవ్వుతో హర్షితముగా చూపిస్తారు. అలాగే పిల్లలైన మీరు కూడా సదా హర్షితముగా ఉండాలి. ఏమి జరిగినాకానీ హర్షితముగానే ఉండండి. ఎప్పుడూ ఉదాసీనత లేక కోపము రాకూడదు. ఏ విధంగా బాబా మీకు మంచి మరియు చెడుల ఙ్ఞానమును ఇస్తారో, ఎప్పుడూ కోపగించుకోరో, ఉదాసీనులుగా అవ్వరో అలాగే పిల్లైన మీరు కూడా ఉదాసీనులుగా అవ్వకూడదు.
ఓంశాంతి.
ధారణ కొరకు ముఖ్యసారము:
1.ఈ పురుషోత్తమ సంగమయుగములో పవిత్రముగా అయి స్వయాన్ని సింగారించుకోవాలి.ఎప్పుడూ మాయ ధుళిలో పొర్లాడి మీ సింగారాన్ని పాడుచేసుకోకూడదు.
2. ఈ డ్రామాను యదార్ధరీతిలో అర్ధంచేసుకొని మీ స్థితిని అచలముగా, స్థిరముగా తయారుచేసుకోవాలి. ఎప్పుడూ తికమక పడకూడదు. ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి.
వరదానము: ప్రసన్నత యొక్క ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సర్వులనూ అధికారులుగా తయారుచేసే గాయన మరియు పూజనయోగ్యభవ.
స్లోగన్: తండ్రి నుండి వరదానమును ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము - హృదయపూర్వకస్నేహము.
No comments:
Post a Comment