మధురమైన పిల్లలూ - ఈ శరీరమును చూడకుండా ఆత్మనే చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి. ఈస్థితిని తయారుచేసుకోండి. ఇదే ఉన్నతమైన లక్ష్యం.
ప్రశ్న: పిల్లలైన మీరు బాబాతోపాటూ పైకి, ఇంటిలోకి ఎప్పుడు వెళతారు?
జవాబు: ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రం కూడా ఉండదో అప్పుడు వెళతారు. ఏ విధంగా బాబా పవిత్రమైనవారో, అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రముగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమక్షములో ఉన్నారు. ఙ్ఞానసూర్యుని ద్వారా ఙ్ఞానమును వింటూ ఎప్పుడైతే మీరు నిండిపోతారో, బాబాను ఖాళీచేసేస్తారో అప్పుడు వారు కూదా శాంతమైపోతారు మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామములోకి వెళ్ళిపోతారు. అక్కడ ఇక ఙ్ఞానబిందువులు ఆగిపోతాయి. వారు సర్వస్వమూ ఇచ్చేశాక ఆ తర్వాత ఇక సైలెన్స్ లో ఉండడమే వారి పాత్ర.
ఓంశాంతి.
ధారణ కొరకు ముఖ్యసారము:
1. స్మృతి, పురుషార్ధం మరియు ఙ్ఞ్నధారణ ద్వారా కర్మాతీతస్థితిని పొందే పురుషార్ధము చేయాలి. ఙ్ఞానసాగరుని సంపూర్ణ ఙ్ఞానమును స్వయములో ధారణచేయాలి.
2. ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో వాటిని తొలగించుకొని సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అంశమాత్రము కూడా అపవిత్రత ఉండకూడదు. ఆత్మలైన మనము సోదరులము అన్న అభ్యాసము చేయాలి.
వరదానము: పరమాత్మ లగ్నము ద్వారా స్వయమును మరియు విశ్వమును నిర్విఘ్నముగా తయారుచేసే తపస్వీమూర్తభవ.
స్లోగన్: చెల్లా చెదురైపోయిన స్నేహమును ప్రోగుచేసి ఒక్క తండ్రిపై స్నేహమును పెట్టుకున్నట్లైతే శ్రమ నుండి విడుదలైపోతారు.
No comments:
Post a Comment