మధురమైన పిల్లలూ - సేవా సమాచారమును వినడము, చదవడము అనే అభిరుచి కూడా మీకు ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస, ఉత్సాహాలు పెరుగుతాయి, సేవ చేసే సంకల్పము కూదా ఉత్పన్నమవుతుంది.
ప్రశ్న: సంగమయుగములో బాబా మీకు సుఖమును ఇవ్వరు కానీ సుఖమును పొందేందుకు దారిని తెలియజేస్తారు. ఎందుకు?
జవాబు: ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే. పిల్లల్లో ఒకరికే సుఖమునివ్వడం కూడా సరికాదు. లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది. అనంతమైన తండ్రి వాటాలు పంచరు, సుఖమునకు దారి చూపిస్తారు. ఎవరైతే ఆ దారిలో నడుస్తారో, పురుషార్ధము చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. పిల్లలు పురుషార్ధం చేయాలి. మొత్తం ఆధారమంతా పురుషార్ధంపైనే ఉంది.
ఓంశాంతి.
ధారణ కొరకు ముఖ్యసారము:
1.ఏ విషయములోనూ వివశులుగా అవ్వకూడదు. స్వయంలో ఙ్ఞానమును ధారణచేసి దానం చేయాలి. ఇతరుల భాగ్యమును కూడా మేల్కొలపాలి.
2. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి. కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. తండ్రి ద్వారా ఏ అపార సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి.
వరదానము: బ్రాహ్మణజీవితములో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తిచేసుకొనే మహాన్ భాగ్యవాన్ ఆత్మా భవ.
స్లోగన్: కోరికలకు వశమై అలజడి చెందుతున్న ఆత్మలను అనంతమైన వైరాగ్యవృత్తి ద్వారా వ్యాకులత నుండి దూరముచేయండి.
No comments:
Post a Comment