"మధురమైన పిల్లలూ- మీరు డబుల్ కిరీటధారులైన రాజులుగా అవ్వాలనుకుంటే చాలా సేవ చేయండి, ప్రజలను తయారు చేయండి, సంగమయుగంలో మీరు సేవే చేయాలి, ఇందులోనే కళ్యాణము ఉంది."
ప్రశ్న: పత ప్రపంచపు వినాశనానికి ముందు ప్రతి ఒక్కరూ ఏ సింగారమును చేసుకోవాలి?
జవాబు: పిల్లలైన మీరు యోగబలం ద్వారా మీ సింగారము చేసుకోండి. ఈ యోగబలము ద్వారానే మొత్తం విశ్వమంతా పావనముగా అవుతుంది, ఇప్పుడు మీరు వానప్రస్థములోకి వెళ్ళాలి, కావున ఈ శరీరమును అలంకరించుకోవలసిన అవసరం లేదు, ఇది పైసకు కూడా విలువచేయనిది, దీనిపై మమకారాన్ని తొలగించివేయండి. వినాశనానికి ముందే బాబా సమానంగా దయార్ధ్రహృదయులుగా అయి మీ స్వసింగారమును, ఇతరుల సింగారమును చేయండి, అంధులకు చేతికర్రగా అవ్వండి.
ధారణ:
1. అమరలోకములోకి వెళ్ళేందుకు సంగమయుగములో సంతోషపు ఖజానాను నింపుకోవాలి, సమయాన్ని వ్యర్ధం చేసుకోకూడదు. మీ జోలెను నింపుకొని దయార్ధ్రహృదయులుగా అయి అంధులకు చేతికర్రగా అవ్వాలి.
2. అరచేతిలో స్వర్గమును తీసుకునేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. స్వయమును సతోప్రధానముగా చేసుకునే యుక్తిని రచించి మీపై మీరే కృప చూపించుకోవాలి, యోగశక్తిని జమ చేసుకోవాలి.
వరదానం: చమత్కారమును చూపించేందుకు బదులుగా అవినాశీ భాగ్యపు మెరుస్తున్నటువంటి సితారగా తయారు చేసే సిద్ధి స్వరూప ఆత్మభవ.
ఈ రోజుల్లో ని అల్పకాలిక సిద్ధి కలిగినవారు చివర్లో పైనుండి వచ్చిన కారణంగా సతోప్రధాన స్థితి ప్రమాణంగా, పవిత్రతా ఫలస్వరూపంగా అల్పకాలపు చమత్కారములను చూపిస్తారు, కానీ ఆ సిద్ధి సదాకాలము ఉండదు, ఎందుకంటే కొద్ది సమయములోనే సతో-రజో-తమో ఈ మూడు స్థితులనూ దాటుతారు. పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు, చమత్కారమును చూపించేందుకు బదులుగా మెరుస్తున్న జ్యొతిస్వరూపులుగా తయారుచేసేవారు. అవినాశీ భాగ్యపు మెరుస్తున్న సితారలుగా తయారుచేస్తారు, కావున అందరూ మీ వద్దకు అంచలిని (దోసిలిలో దానమును) స్వీకరించేందుకు వస్తారు.
స్లొగన్: అనంతమైన వైరాగ్య వృత్తితో కూడిన వాయుమండలము ఉన్నట్లయితే సహయోగులు సహజయోగులుగా అయిపోతారు.
No comments:
Post a Comment