"మధువనం హృదయ సిం హాసనాధికారి ఆత్మ గుర్తు"
వరదానం: పవిత్రతా గుహ్యతను తెలుసుకొని సుఖ-శాంతి-సంపన్నులుగా అయ్యే మహాన్ ఆత్మ భవ.
పవిత్రతా శక్తి గొప్పతనాన్ని తెలుసుకొని ఇప్పటినుండే పవిత్రంగా అనగా పూజ్య దేవ ఆత్మలుగా అవ్వండి. అంతిమములో అయిపోతాములే అని కాదు. చాలా కాలమునుండి జమ చేసుకొన్న ఈ శక్తి అంతిమములో పనికి వస్తుంది. పవిత్రంగా అవ్వటము అన్నది సామాన్యవిషయమేమీ కాదు. బ్రహ్మచారిగా ఉంటారు, పవిత్రంగా అయిపోతారు..... కానీ పవిత్రత జనని(తల్లి). సంకల్పముద్వారా గానీ, వృత్తిద్వారా గానీ, వాయుమండలముద్వారా, వాణిద్వారా, సంపర్కముద్వారా సుఖ-శాంతులకు జననిగా అవ్వటము - వీరినే మహాన్ ఆత్మలు అని అంటారు.
స్లొగన్: ఉన్నత స్థితిలో స్థితులయ్యి సర్వ ఆత్మలకు దయా దృష్టిని ఇవ్వండి, వైబ్రేషన్లను వ్యాపింపచేయండి.
No comments:
Post a Comment