Monday, July 20, 2009

పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఏ చెకింగ్ ను చేయగలుతారు? మీ పురుషార్ధము ఏమిటి?

"మధురమైన పిల్లలూ- బాబా సమానంగా దయార్ధ్ర హృదయులుగా మరియు కళ్యాణకారులుగా అవ్వండి, ఎవరైతే స్వయం పురుషార్ధం చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో వారే వివేకవంతులు."

ప్రశ్న: పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఏ చెకింగ్ ను చేయగలుతారు? మీ పురుషార్ధము ఏమిటి?

జవాబు: చదువుద్వారా మీరు ఉత్తమపాత్రను అభినయిస్తున్నారో లేక మధ్యమ పాత్రను అభినయిస్తున్నారో లేక కనిష్టమైనదానిని అభినయిస్తున్నారో పరిశీలించుకోగలుగుతారు. ఎవరైతే ఇతరులను కూడా ఉత్తములుగా తయారుచేస్తారో అనగా సేవ చేసి బ్రాహ్మణుల వృద్ధిని చేస్తారో వారిది ఉత్తమ పాత్ర అని అనడం జరుగుతుంది. పాత చెప్పును తీసి కొత్త చెప్పును వేసుకోవడం మీ పురుషార్ధం. ఎప్పుడైతే ఆత్మ పవిత్రం గా అవుతుందో అప్పుడు దానికి క్రొత్త పవిత్ర శరీరం లభిస్తుంది.

ధారణ:
1. జ్ఞానము మరియు యోగముల ద్వారా మీ బుద్ధిని రిఫైన్ చేసుకోవాలి. తండ్రిని మరిచిపోయే పొరపాటును ఎప్పుడూ చేయకూడదు. ప్రేయసులుగా అయి ప్రియుడిని స్మృతి చేయాలి.

2. బంధన ముక్తులుగా అయి మీ సమానంగా తయారుచేసే సేవను చేయాలి. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్ధము చేయాలి. పురుషార్ధంలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు.

వరదాం: శాంతి శక్తి యొక్క సాధనాలద్వారా విశ్వమును శాంతిగా తయారుచేసే ఆత్మిక శస్త్రధారీ భవ.

శాంతి శక్తికి సాధనము - శుభ సంకల్పము, శుభ భావన మరియు నయనాల భాష. ఏవిధంగా నోటినుండి వచ్చే భాషద్వారా తండ్రి మరియు రచనల పరిచయమును ఇస్తారో, అలా శాంతి శక్తి ఆధారముతో, నయనాల భాషద్వారా తండ్రిని అనుభవము చేయించగలరు. స్థూలమైన సేవా సాధనాలకన్నా ఎక్కువగా సైలెన్స్ శక్తి అతి శ్రేష్టమైనది. ఆత్మిక సేనకు ఇదే విశేష శస్త్రము(ఆయుధము) - ఈ శస్త్రముద్వారా అశాంతమయమైన విశ్వమును శాంతిగా తయారుచేయగలరు.

స్లొగన్: నిర్విఘ్నంగా ఉండటము మరియు నిర్విఘ్నంగా తయారుచేయటము - ఇదే సత్యమైన సేవకు ప్రమాణము(ఋజువు).

No comments:

Post a Comment