"మధురమైన పిల్లలూ- దేహీ అభిమానులుగా అయినట్లయితే శీతలముగ అయిపోతారు వికారాల దుర్ఘంధం తొలగిపోతుంది, అంతర్ముఖులుగా అయిపోతారు, పుష్పాలుగా అయిపోతారు"
ప్రశ్న: బాప్ దాదా పిల్లలందరికీ ఏ రెండు వరదానాలను ఇస్తారు? వాటిని స్వరూపములోకి తీసుకువచ్చేందుకు విధి ఏమిటి?
జవాబు: బాబా పిల్లలందరికీ శాంతి మరియు సుఖముల వరదానాల్ని ఇస్తారు. పిల్లలూ, మీరు శాంతిలో ఉండే అభ్యాసము చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే, మీరు వారికి జవాబు చెప్పకండి, మీరు శాంతిగా ఉండాలి, వ్యర్ధమైన పరచింతన విషయాలను మాట్లాడకూడదు, ఎవ్వరికీ దు:ఖమునివ్వకూడదు. మీ నోట్లో శాంతి మొహరును వేసుకున్నట్లయితే ఆ రెండూ వరదానాలూ స్వరూపములోకి వచ్చేస్తాయి అని బాబా అంటారు.
ధారణ:
1. ఆశీర్వదించమని లేక కృపచూపించమని బాబాను అడగకూడదు. తండ్రిని, టీచర్ను, గురువును స్మృతిచేసే మీపైన మీరు కృప చూపించుకోవాలి, మాయతో అప్రమత్తంగా ఉండాలి, కళ్ళు మోసగిస్తాయి, వీటిని మీ ఆధీనములో ఉంచుకోవాలి.
2. వ్యర్ధమైన పరచింతన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి, కావున ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి, మీ నొట్లో మొహరును వేసుకోవాలి, ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. స్వయమూ అశాంతిగా అవ్వకూడదు, అలాగే ఎవ్వరినీ అశాంతపరచకూడదు.
వరదానం: శాంతి శక్తి ప్రయోగము ద్వారా ప్రతి కార్యములో సహజ సఫలతను ప్రాప్తి చేసుకొనే ప్రయోగీ ఆత్మభవ.
స్లొగన్: సర్వులకు ప్రియంగా అవ్వాలనుకుంటే వికసించిన ఆత్మిక గులాబి గా అవ్వండి ముడుచుకోండి.
No comments:
Post a Comment