"మధురమైన పిల్లలూ- మీరు సమయం వచ్చినప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి, కావున స్మృతి వేగమును పెంచండి, ఈ దు:ఖధామాన్ని మరచిపోయి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి."
ప్రశ్న: ఏ ఒక్క గుహ్యమైన రహస్యాన్ని మీరు మనుష్యులకు అర్ధం చేయించినట్లయితే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది?
జవాబు: ఆత్మ ఎంతో చిన్నని బిందువు, అందులో సదాకాలపు పాత్ర నిండి ఉంది, ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది, అది ఎప్పుడూ అలసిపోదు అని మీరు ఈ గుహ్యమైన రహస్యాన్ని వారికి వినిపించండి. మోక్షము ఎవరికీ లభించజాలదు, మనుష్యులు ఎంతో దు:ఖాన్ని చూసి, మోక్షం లభిస్తే మంచిది అని భావిస్తారు, కాని అవినాశీ అయిన ఆత్మ పాత్రను అభినయించకుండా ఉండజాలదు. ఈ విషయాన్ని విని వారి లోపల అలజడి మొదలవుతుంది.
ధారణ:
1. ఏ విధంగా చదివించే టీచర్ విదేహియో, వారికి దేహపు అభిమానము లేదో ఆ విధముగా విదేహులుగా అవ్వాలి. శరీరము అభిమానమును వదిలివేస్తూ ఉండాలి. అశుధమైన దృష్టిని మార్చి శుధమైన దృష్టిని తయారు చేసుకోవాలి.
2. మీ బుద్ధిని విశాలముగా చేసుకోవాలి, శిక్షల నుండి విముక్తులయ్యేందుకు తండ్రిపై లేక చదువుపై గౌరవమును ఉంచాలి, ఎప్పుడూ దు:ఖము నివ్వకూడదు. అశాంతిని వ్యాపింపచేయకూడదు.
వరదానం: బ్రాహ్మణ జీవితంలో ప్రతి క్షణము సుఖమయ స్థితిని అనుభవము చేసుకొనే సంపూర్ణ పవిత్ర ఆత్మా భవ.
పవిత్రతనే సుఖ-శాంతుల జనని అని అంటారు. ఏవిధమైన అపవిత్రత అయినా దు:ఖమును-అశాంతిని అనుభవము చేయిస్తుంది. బ్రాహ్మణ జీవితము అనగా ప్రతి క్షణము సుఖమయ స్థితిలో ఉండేవారు. దు:ఖపు దృశ్యము అయినాగానీ ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ దు:ఖపు అనుభవము ఉండజాలదు. పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తలు అయ్యి దు:ఖమును ఆత్మిక సుఖపు వాయుమండలములోకి పరివర్తన చేసేస్తారు.
స్లొగన్: సాధానాలను ప్రయోగిస్తూ సాధనను పెంచుకోవటమే అనంతమైన వైరాగ్య వృత్తి.
No comments:
Post a Comment