Thursday, July 23, 2009

సంగమయుగంలో బాబా నుండి ఏ వారసత్వము పిల్లలందరికీ ప్రాప్తమవుతుంది?

"మధురమైన పిల్లలూ- పిల్లిమొగ్గల ఆటను గుర్తుంచుకోండి, ఈ ఆటలో మొత్తం చక్రము, బ్రహ్మ మరియు బ్రాహ్మణుల రహస్యము ఇమిడి ఉంది."

ప్రశ్న: సంగమయుగంలో బాబా నుండి ఏ వారసత్వము పిల్లలందరికీ ప్రాప్తమవుతుంది?

జవాబు: ఈశ్వరీయ బుద్ధి అనే వారస్త్వము. ఈశ్వరునిలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని మనకు వారసత్వముగా ఇస్తారు. మన బుద్ధి వజ్రతుల్యంగా, పారసంగా అవుతుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయి తండ్రి నుండి చాలా భారీ ఖజానాను తీసుకుంటున్నాము. సర్వగుణాలతో మన జోలెను నింపుకుంటున్నాము.

ధారణ:
1. వృక్షపతి అయిన తండ్రి నుండి సుఖశాంతులు-పవిత్రత వారస్త్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని అకాలమూర్త ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఈశ్వరీయ బుద్ధిని తయారుచేసుకోవాలి.

2. తండ్రి ద్వారా సత్యమైన కధను విని ఇతరులకు వినిపించాలి. మాయాజీతులుగా అయ్యేందుకు మీ సమానముగా తయారుచేసే సేవను చేయాలి. మేము కల్పకల్పపు విజయులము, తండ్రి మాతోపాటు ఉన్నారు అని మీ బుద్ధిలో ఉండాలి.

వరదానం: పవిత్రత యొక్క శక్తిశాలీ దృష్టి-వృత్తి ద్వారా సర్వ ప్రాప్తులను చేయించే దు:ఖహర్త-సుఖకర్తా భవ.

సైన్సు మందులలో దు:ఖపు నెప్పిని సమాప్తము చేసే అల్పకాలిక శక్తి ఉంది, కానీ పవిత్రతా శక్తిలో అనగ సైలెన్సు శక్తిలో అయితే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రతో కూడిన ఈ శక్తిశాలీ దృష్టి-వృత్తి సదాకాలపు ప్రాప్తిని చేయిస్తుంది. కావుననే మీ జడ చిత్రాల ముందు ఓ దయామయీ, దయ చూపించు అంటూ దయ లేక ఆశీర్వాదాలను కోరుకుంటారు. కావున చైతన్యములో ఎప్పుడైతే ఇటువంటి మాస్టర్ దు:ఖహర్త-సుఖకర్తలుగా అయ్యి దయను చూపిస్తారో అప్పుడే భక్తిలో పూజింపబడతారు.

స్లొగన్: సమయ సమీపత అనుసారంగా అనంతమైన వైరాగ్యమే సత్యమైన తపస్సు లేక సాధన.

No comments:

Post a Comment