Friday, July 24, 2009

బాబా తమ ఇంట్లోకి ఏ పిల్లలను ఆహ్వానిస్తారు?

"మధురమైన పిల్లలూ- బాబా నుండి హొల్ సేల్ వ్యాపారమును చేయడం నేర్చుకోండి, మన్మనాభవ - అల్లాను స్మృతి చేయడము మరియు చేయించడము ఇదే హొల్ సేల్ వ్యాపారము, మిగిలినదంతా చిల్లర వ్యాపారమే."

ప్రశ్న: బాబా తమ ఇంట్లోకి ఏ పిల్లలను ఆహ్వానిస్తారు?

జవాబు: ఏ పిల్లలైతే బాబా మతముపై బాగా నడుస్తారో మరియు ఇంకెవ్వరినీ స్మృతి చేయరో, దేహసహితముగా దేహపు సర్వ సంబంధాలనుండి బుద్ధి యోగాన్ని తెంచి ఎవరైతే ఒక్కరి స్మృతిలో ఉంటారో అటువంటి పిల్లలను బాబా తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. బాబా ఇప్పుడు పిల్లలను పుష్పాల వలె తయారు చేస్తారు, మళ్ళీ పుష్పాలుగా అయిన పిల్లలను తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు.

ధారణ:
1. ఏ విధంగా బాబా పిల్లలపై బలిహారమవుతారో అలా తనువు, మనస్సు, ధనం సహితంగా ఒక్కసారి తండ్రిపై పూర్తిగా బలిహారమై 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి.

2. తండ్రి ఏ అమూల్యమైన అవినాశీ ఖజానాలను ఇస్తారో వాటితో మీ జోలెను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమాపదమ భాగ్యశాలురము అన్న సంతోషము లేక నషా లోనే ఉండాలి.

వరదానం: సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసిగా అయ్యే అంతర్ముఖీ భవ.

సైలెన్స్ శక్తిని ప్రయోగము చేసేందుకు అంతర్ముఖిగా మరియు ఏకాంతవాసిగా అయ్యే అవశ్యకత ఉంది. అంతర్ముఖస్థితిని అనుభవము చేసేందుకు మరియు ఏకాంతవాసిగా అయ్యేందుకు అసలు సమయమే లభించటం లేదు ఎందుకంటే సేవా ప్రవృత్తి, వాణి శక్తి యొక్క ప్రవృత్తి చాలా ఎక్కువైపోయాయి అని చాలా మంది పిల్లలు అంటుంటారు కాని ఇందుకొరకు ఒకేసారి అర్ధగంట లేక ఒక గంటని కేటాయించేందుకు బదులుగా మధ్య మధ్యలో కొద్ది సమయము కేటాయించినా కూడా శక్తిశాలీ స్థితి తయారయిపోతుంది.

స్లొగన్: బ్రాహ్మణ జీవితములో యుద్ధము చేసేందుకు బదులుగా ఆనందాన్ని అనుభవించినట్లైతే కష్టము కూడా సహజమైపోతుంది.

No comments:

Post a Comment