"మధురమైన పిల్లలూ- ఈ అనాది అయిన డ్రామా తిరుగుతూనే ఉంటుంది, టిక్ టిక్ అంటూనే ఉంటుంది, ఇందులో ఒకదాని పాత్ర ఇంకొకదానితో కలువజాలదు, దీనిని యదార్ధరీతిగా అర్ధం చేసుకొని సదా హర్షితముగా ఉండాలి."
ప్రశ్న: ఏ యుక్తిద్వారా మీరు భగవంతుడు వచ్చేసాడు అని నిరూపించి చెప్పగలుగుతారు?
జవాబు: భగవంతుడు వచ్చేసాడు అని ఎవ్వరితోనూ నేరుగా చెప్పకూడదు, అలా చెబితే మనుష్యులు అపహాస్యం చేస్తారు, విమర్సిస్తారు. ఈ రోజుల్లో తమను తాము భగవంతునిగా పిలుచుకొనే వారు ఎందరో ఉన్నారు. కావున మీరు యుక్తిగా మొదట ఇద్దరు తండ్రుల పరిచయమును ఇవ్వండి. ఒకరు హద్దులోని తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది మరియు అనంతమైన తండ్రి అనంతమైన వారస్త్వాన్ని ఇస్తారు అని చెప్పండి, అప్పుడు అర్ధం చేసుకుంటారు.
ధారణ:
1. ఈ సమయంలోనే బాబా సమానముగా పర్ ఫెక్ట్ గా అయి పూర్తి వారస్త్వాన్ని తీసుకోవాలి. బాబా ఇచ్చే శిక్షణలన్నింటినీ స్వయంలో ధారణ చేసుకొని వారి సమానంగా జ్ఞానసాగరులుగా, శాంతి-సుఖ సాగరులుగా అవ్వాలి.
2. బుద్ధిని పారసముగా చేసుకునేందుకు చదువుపై పూర్తి ధ్యానమును ఉంచాలి, నిశ్చయబుద్ధి కలవారిగా అయి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షను పాసవ్వాలి.
వరదానము - సేవలో ఉంటూ సంపూర్ణతా సమీప్యతను అనుభూతి చేయించే బ్రహ్మబాబా సమాన ఉదహరణ భవ.
బ్రహ్మబాబా సేవలో ఉంటూ, సమాచారాన్ని వింటూ కూడా ఏకాంతవాసిగా అయ్యి ఉండేవారు. ఒక గంట సమాచారాన్ని 5 నిముషాలలో సారాన్ని తెలుసుకొని, పిల్లలను సంతోషపరచి మళ్ళీ తన అంతర్ముఖి, ఏకాంతవాసీ స్థితిని అనుభవము చేయించేవారు. అలా బాబాను అనుసరించండి. నేను చాలా బిజీగా ఉన్నాను అని బ్రహ్మబాబా ఎప్పుడూ అనలేదు, పిల్లలముందు ఉదాహరణగా అయ్యారు. అలా సమయానుసారంగా ఇప్పుడు ఈ అభ్యాసపు ఆవశ్యకత ఉంది.
స్లొగన్: ప్రతి కర్మలో కర్మ మరియు యోగముల అనుభవము ఉండటమే కర్మయోగము.
No comments:
Post a Comment