Monday, July 27, 2009

మీరు ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నింటికన్న మంచి నడవడిక ఏది?

"మధురమైన పిల్లలూ- మీకు జ్ఞానరత్నాలను ఇచ్చేందుకు, మురళిని వినిపించేందుకు బాబా వచ్చారు, కావున మీరు ఎప్పుడూ మురళిని మిస్ చేయకూడదు, మురళీపై ప్రేమ లేదంటే బాబాపై కూడా ప్రేమ లేదన్నట్లే."

ప్రశ్న: మీరు ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నింటికన్న మంచి నడవడిక ఏది?

జవాబు: నిర్వికారులుగా అవ్వడము అన్నింటికన్న మంచి నడవడిక. ఈ ప్రపంచమంతా వికారమయమైనదని మీకు జ్ఞానం లభించింది. వికారమయము అనగా క్యారెక్టర్ లెస్. బాబా నిర్వికారీ ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు. నిర్వికారీ దేవతలు మంచి నడవడిక కలవారు. బాబా స్మృతి ద్వారానే నడవడిక బాగుపడుతుంది.

ధారణ:

1. మన తండ్రి ఉన్నతోన్నతుడైన తండ్రి, ఉన్నతోన్నతుడైన టీచర్, ఉన్నతోన్నతుడైన సద్గురువు. ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి. తండ్రి మరియు వారసత్వపు చదువును చదివించాలి.

2. జ్ఞానము అనగా సృష్టి చక్రపు జ్ఞానమును ధారణ చేసి స్వదర్సన చక్రధారులుగా అవ్వాలి మరియు విజ్ఞానము అనగా శబ్ధము నుండి అతీతముగా శాంతిలోకి వెల్లడం. 7 రోజుల కోర్సు ను చేసి ఆ తర్వాత ఎక్కడ ఉన్నా చదువును చదవాలి.

వరదానము - ఈశ్వరీయ విధానమును తెలుసుకొని విధిద్వారా స్థితిని ప్రాప్తి చేసుకొనే ఫస్ట్ డివిజన్ కు అధికారీ భవ.

ధైర్యముతో ఒక్క అడుగు వేస్తే కోటాను రెట్ల అడుగుల సహాయము లభించే ఈ విధానపు విధి డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఒకవేళ ఈ విధి, విధానము లేనట్లయితే అందరూ విశ్వపు మొదటి మహారాజుగా అయిపోతారు. నంబర్ వారీగా అయ్యే విధానము ఈ విధి కారణంగానే తయారవుతుంది. కావున ఎంత కావాలనుకుంటే అంత ధైర్యమును ఉంచండి - సహాయాన్ని తీసుకోండి. సమర్పణ అయినవారైనా లేక ప్రవృత్తిలోని వారయినా అధికారమైతే సమానంగా ఉంది, కానీ విధి ద్వారానే సిద్ధి ఉంటుంది. ఈ ఈశ్వరీయ విధానమును తెలుసుకొని నిర్లక్ష్యత లీలను సమాప్తము చేసినట్లయితే ఫస్ట్ డివిజన్ అధికారము లభిస్తుంది.

స్ల్గోన్: సంకల్పాల ఖజానా పట్ల ఎకానమీ(పొదుపు) అవతారంగా అవ్వండి.

No comments:

Post a Comment