"మధురమైన పిల్లలూ - దు:ఖహర్త, సుఖకర్త అయిన తండ్రి ఒక్కరే, వారే మీ దు:ఖాలన్నింటినీ దూరం చేస్తారు, మనుష్యులు ఎవ్వరి దు:ఖాలనూ దూరం చేయలేరు.”
ప్రశ్న: విశ్వములో అశాంతికి కారణం ఏమిటి? శాంతిస్థాపన ఎలా జరుగుతుంది?
జవాబు: విశ్వములోని అశాంతికి కారణము - అనేకానేక ధర్మాలు, కలియుగాంతములో అనేకత ఉన్నప్పుడు అశాంతి ఉంటుంది, తండ్రి వచ్చి ఒక్క సత్యధర్మ స్థాపన చేస్తారు, అక్కడ శాంతి ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో శాంతి ఉండేదని, పవిత్ర ధర్మము, పవిత్ర కర్మ ఉండేవని మీరు అర్ధం చేసుకోగలరు. కళ్యాణకారి అయిన తండ్రి మళ్ళీ ఆ క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు, అందులో అశాంతి అన్నమాటే ఉండదు.
ధారణ:
1. రాజయోగ విద్య సంపాదనకు ఆధారము. ఎందుకంటే, దీని ద్వారానే మనం రాజాధిరాజులుగా అవుతాము. ఈ ఆత్మిక చదువును రోజూ చదవాలి మరియు చదివించాలి.
2. బ్రాహ్మణులమైన మేము సత్యమైన ముఖవంశావళులము, మేము కలియుగీ రాత్రి నుండి తొలగి పగలులోకి వచ్చాము అన్న నషా సదా ఉండాలి. ఇది కళ్యాణకారీ పురుషోత్తమ యుగము, ఇందులో స్వయము మరియు సర్వుల కళ్యాణమును చేయాలి.
వరదానం: పాత స్వభావ - సంస్కారాల భారమును సమాప్తము చేసి డబుల్ లైట్ గా ఉండే ఫరిస్తాభవ.
బాబాకు చెందినవారుగా అయినట్లయితే మరి మొత్తము భారాన్ని తండ్రికి ఇచ్చేసేయండి. పాత స్వభావ సంస్కారాల భారము కొద్ధిగా అయినా మిగిలి ఉన్నట్లయితే అవి పైనుండి కిందకు తీసుకువస్తాయి. ఎగిరే కళ అనుభవమును చెయ్యనియ్యవు. కావుననే అన్నీ ఇచ్చేయ్యండి అని బాప్ దాదా అంటారు. ఈ రావణుని ఆస్తిని మీ వద్ద ఉంచుకున్నట్లయితే దు:ఖమునే పొందుతారు. ఫరిస్తా అనగా రావణుని ఆస్తి కొంచెముకూడా లేకుండా ఉండటము. పాత ఖాతాలన్నింటినీ భస్మము చేసినఫ్ఫుడే డబుల్ లైట్ ఫరిస్తా అని అంటారు.
స్లొగన్: నిర్భయులుగా మరియు హర్షితముఖులుగా అయ్యి అనంతమైన ఆటను చూసినట్లయితే అలజడిలోకి రారు.
No comments:
Post a Comment