Wednesday, July 29, 2009

పిల్లలైన మీరు బాబాపై ఎందుకు బలిహారమవుతారు? బలిహారమవ్వడం అంటే ఏమిటి?

"మధురమైన పిల్లలూ - మీరు మీ సమయాన్ని వ్యర్ధం చేసుకోకూడదు, మీ లోలోపల జ్ఞానమును స్మరిస్తూ ఉన్నట్లయితే నిద్రాజీతులుగా అయిపోతారు, ఆవలింతలు మొదలైనవి రావు."

ప్రశ్న: పిల్లలైన మీరు బాబాపై ఎందుకు బలిహారమవుతారు? బలిహారమవ్వడం అంటే ఏమిటి?

జవాబు: బలిహారమవ్వడం అనగా బాబా స్మృతిలో ఇమిడిపోవడం. ఎప్పుడైతే స్మృతిలో ఇమిడిపోతారో అప్పుడు ఆత్మరూపీ బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఆత్మరూపీ బ్యాటరీ నిరాకారుడైన తండ్రితో జోడించబడినప్పుడు బ్యాటరీ చార్జ్ అవుతుంది. వికర్మలు వినాశనమవుతాయి, సంపాదన జమ అవుతుంది.

ధారణ:
1. తండ్రి నుండి అవినాశీ జ్ఞానరత్నాలను తీసుకొని ఇతరులకు దానం చేయాలి. జ్ఞానదానం చేయడంలో పిసినార్లుగా అవ్వకూడదు. జ్ఞానపు పాయింట్లు లోలోపల తిరుగుతూ ఉండాలి. రాజులుగా అయ్యేందుకు ప్రజలను తప్పకుండా తయారుచేసుకోవాలి.

2. నేను బాబా సమానముగా ప్రేమసాగరుడిగా అయ్యానా? ఎప్పుడూ, ఎవ్వరినీ అసంతుష్టపరచడం లేదు కదా? నా నడవడికపై పూర్తి ధ్యానము ఉందా? అని మీ లెక్కాపత్రాలను చూసుకోవాలి.

వరదానం: సదా శ్రేష్ట సమయానుసారంగా శ్రేష్ట కర్మ చేస్తూ ఓహొ-ఓహొ అనే గీతమును గానము చేసే భాగ్యవాన్ ఆత్మ భవ.

ఈ శ్రేష్ట సమయములో సదా శ్రేష్ట కర్మను చేస్తూ "ఓహొ-ఓహొ" అనే గీతమును మనసులో పాడుతూ ఉండండి. "ఓహొ! నా శ్రేష్ట కర్మ లేక ఓహొ! శ్రేష్ట కర్మను నేర్పించే బాబా" కావున సదా ఓహొ-ఓహొ గీతమును పాడుతూ ఉండండి. దు:ఖపు దృశ్యమును చూస్తున్నాగానీ ఎప్పుడూ పొరపాటున కూడా - అయ్యో అన్న మాట వెలువడకూడదు. ఓహొ డ్రామా ఓహొ! మరియు ఓహొ బాబా ఓహొ! స్వప్నములో కూడా ఊహించనిది ఇంట్లో కూర్చునే లభించింది అన్న ఈ భాగ్యపు నషా లో ఉండండి.

స్లొగన: మనసు - బుద్ధిని శక్తిశాలిగా తయారుచేసినట్లయితే ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా-దృడంగా ఉంటారు.

No comments:

Post a Comment