వరదానము: సాధనాలను నిర్లేపులుగా మరియు అతీతముగా అయ్యి కార్యములో వినియోగించే అనంతమైన వైరాగీ భవ.
అనంతమైన వైరాగి అనగా ఎవ్వరిపైన ఆకర్షణ లేకుండా సదా తండ్రికి ప్రియముగా ఉండేవారు. ఈ ప్రియత్వమే అతీతముగా తయారుచేస్తుంది. తండ్రికి ప్రియముగా అవ్వనట్లయితే అతీతముగా కూడా అవ్వజాలరు, ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియమయినవారుగా ఉంటారో వారు సర్వ ఆకర్షణలనుండి దూరంగా అనగా అతీతముగా ఉంటారు - దీనినే నిర్లేప స్థితి అని అంటారు. ఎటువంటి హద్దు ఆకర్షణల ప్రభావములోకి వారు రారు. రచన లేక సాధానాలను నిర్లిప్తులై కార్యములోకి తీసుకువస్తారు - ఇటువంటి అనంతమైన వైరాగులే రాజఋషులు.
స్లొగన్: హృధయపు స్వచ్చత - శుభ్రత ఉన్నట్లయితే తండ్రి రాజీ అయిపోతారు.
No comments:
Post a Comment