"మధురమైన పిల్లలూ - స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది, మీరు నష్టము నుండి లాభములోకి వస్తారు. విశ్వాధిపతులుగా అవుతారు."
ప్రశ్న: సత్యపు సాగత్యము కలవారు. తీరాన్ని చేరుతారు మరియు కుసాంగత్యము కలవారు మునిగిపొతారు, దీని అర్ధమేమిటి?
జవాబు: పిల్లలైన మీకు ఎప్పుడైతే సత్యపు సాంగత్యము అనగా తండ్రి సాంగత్యము లభిస్తుందో అప్పుడు మీరు పైకి ఎక్కే కళలోకి వెళతారు. రావణుని సాగత్యము కుసాంగత్యము. అతడి సాంగత్యము ద్వారా మీరు కిందకు దిగుతారు అనగా రావణుడు మిమ్మల్ని ముంచేస్తాడు. తండ్రి తీరానికి చేరుస్తారు. ఒక్క క్షణములో ఎటువంటి సాంగత్యమును ఇస్తారంటే, దాని ద్వారా మీ గతి, సద్గతి జరుగుతుంది. కావున వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. ఇది తండ్రి అధ్బుతము.
ధారణ:
1. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు, విజయమాలలోని మణులుగా అయ్యేందుకు పురుషార్ధము చేయాలి. ఆత్మిక పండాలుగా అయి, అందరిచేతా శాంతిధామమైన ఇంటి యాత్రను చేయించాలి.
2. స్మృతియాత్రను పెంచుతూ అన్ని పాపాల నుండి ముక్తులైపోవాలి. యోగాగ్ని ద్వారా ఆత్మను స్వచ్చమైన బంగారముగా తయారుచేసుకోవాలి, సతోప్రధానముగా అవ్వాలి.
వరదానము - తమ శుభ చింతన శక్తిద్వారా ఆత్మలను చింతాముక్తులుగా తయారు చేసే శుభ చింతక మణీభవ.
నేటి విశ్వములో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఆ చింతామణులను శుభ చింతకమణులైన మీరు మీ శుభచింతన శక్తిద్వారా పరివర్తన చెయ్యగలరు. ఏ విధంగా సూర్యుని కిరణాలు చాలా దూరము వరకు అంధకారమును తొలగిస్తాయో, అలా శుభ చింతకమణులైన మీ శుభ సంకల్పములనే ప్రకాశము లేక కిరణాలు విశ్వములో నలువైపులా వ్యాపిస్తున్నాయి, కావున ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రకాశము గుప్తరూపములో తన కార్యమును నిర్వహిస్తూ ఉంది అని భావిస్తారు. ఈ టచింగ్ ఇప్పుడు మొదలయింది, చివరకు వెతుక్కుంటూ-వెతుక్కుంటూ అసలైన స్తానమునకు చేరుకుంటారు.
స్లొగన్: బాప్ దాదా ల డైరెక్షన్ ను స్పష్టముగా గ్రహించేందుకు మనస్సు- బుద్ధి యొక్క లైన్ ను క్లయర్ గా ఉంచుకోండి.
No comments:
Post a Comment