Tuesday, August 4, 2009

ఏ రహస్యమును తెలుసుకున్న కారణముగా పిల్లలైన మీరు సర్వుల కళ్యాణకారులుగా అవుతారు?

"మధురమైన పిల్లలూ - తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు - ఈ మూడు పదాలనూ గుర్తుంచుకున్నట్లయితే అనేక విశేషతలు వచ్చేస్తాయి."

ప్రశ్న: ఏ పిల్లల ప్రతి అడుగులోను కోట్లాదిరెట్ల సంపాదన జమ అవుతూ ఉంటుంది?

జవాబు: ఏ పిల్లలైతే తండ్రి ప్రతి అడుగునూ సేవలో ముందుకు తీసుకువెళుతూ ఉంటారో వారే కోటానురెట్ల సంపాదనను జమ చేసుకుంటారు. బాబా సేవలో అడుగులు ముందుకు వేయకపోతే అంతటి సంపాదనను ఎలా పొందుతారు? సేవయే ప్రతి అడుగులోనూ కోటానురెట్లను ఇస్తుంది. దీని ద్వారానే పదమాపదమపతులుగా అవుతారు.

ప్రశ్న: ఏ రహస్యమును తెలుసుకున్న కారణముగా పిల్లలైన మీరు సర్వుల కళ్యాణకారులుగా అవుతారు?

జవాబు: అందరికీ ఇదొక్కటే దుకాణము, అందరూ ఇక్కడకు రావలసిందే అని బాబా పిల్లలైన మనకు ఈ రహస్యాన్ని అర్ధం చేయించారు. ఇది చాలా గుహ్యమైన రహస్యము. ఈ రహస్యాన్ని తెలుసుకునే పిల్లలే సర్వుల కళ్యాణకారులుగా అవుతారు.

ఓంశాంతి.

ధారణ:

1. గృహస్థ వ్యవహారములో చాలా యుక్తిగా నడుచుకోవాలి, ఎవ్వరినీ అసంతుష్టపరచకూడదు, అలాగే పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి.

2. ఒక్క తండ్రి నుండి అవినాశీ జ్ఞానరత్నాల దానమును తీసుకొని మీ బుద్ధి రూపీ జోలెను నిండుగా ఉంచుకోవాలి, బుద్ధిని భ్రమింపచేసుకోకూడదు. సందేశకులుగా అయి అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి.

వరదానము: స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారమును ప్రాప్తి చేసుకొనే భాగ్యశాలీ ఆత్మాభవ.

బహుకాలపు రాజ్య అధికారిగా అయ్యే సంస్కారము బహుకాలపు భవిష్య రాజ్య అధికారిగా తయారుచేస్తుంది. ఒకవేళ పదే పదే వశీభూతులుగా అవుతుంటే, అధికారిగా అయ్యే సంస్కారము లేనట్లయితే రాజ్య అధికారుల రాజ్యములో ఉంటారు, కానీ రాజ్యభాగ్యము ప్రాప్తించదు. కావున జ్ఞానమనే దర్పణములో మీ అదృష్టమనే ముఖాన్ని చూసుకోండి. బహుకాలపు అభ్యాసముద్వారా మీ విశేష సహయోగులైన కర్మచారులను (కరేంద్రియాలను) లేక రాజ్య వ్యవహారములను నడిపించే సహచరులను మీ అధికారముతో నడిపించండి. రాజుగా అయినప్పుడే భాగ్యశాలీ ఆత్మ అని అంటారు.

స్లొగన్: సకాష్(శక్తి, ప్రకాశము)ను ఇచ్చే సేవ చేసేందుకు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి.

No comments:

Post a Comment