"మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీ అన్ని ఆశలు పూర్తవుతాయి, మీ కడుపు నిండిపోతుంది, మిమ్మల్ని తృప్త ఆత్మలుగా చేసేందుకు తండ్రి వచ్చారు."
ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు భక్తిని చేయరు కాని మీరు కూడా తప్పకుండా భక్తులే, అది ఎలా?
జవాబు: ఎప్పటివరకైతే దేహాభిమానము ఉంటుందో అప్పటివరకూ భక్తులే. మీరు జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు, ఎప్పుడైతే పరీక్షను పాస్ అవుతారో, కర్మాతీతముగా అయిపోతారో అప్పుడే మిమ్మల్ని సంపూర్ణ జ్ఞానులు అని అంటారు, ఆ తర్వాత చదవవలసిన అవసరం లేదు.
ధారణ:
1. ఎటువంటి తృప్త ఆత్మగా మరియు విశాలబుద్ధి కలవారిగా అవ్వాలంటే ఎవరిలోనూ మీ ఆకర్షణ వెళ్ళకూడదు, మీ హృదయంలో ఎటువంటి ఆశా ఉండకూడదు, ఎందుకంటే ఇదంతా అంతమవ్వనున్నది.
2. శరీర నిర్వహణార్ధము కర్మ చేస్తూ సంతోషపు పాదరసము సదా పైకి ఎక్కి ఉండాలి, తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి. బుద్ధి హద్దులో నుండి తొలగిపోయి సదా అనంతములో ఉండాలి.
వరదానం: స్వ-రాజ్యము ద్వారా తమ సహచరులను స్నేహీ సహయోగులుగా తయారుచేసే మాస్టర్ దాతా భవ.
రాజు అనగా దాత. చెప్పటము లేక యాచించటమన్నది దాత చెయ్యడు. ప్రతి ఒక్కరూ స్వయమే రాజుకు తమ స్నేహ కానుకలను ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయముపై రాజ్యము చేసే రాజుగా అయినట్లయితే ప్రతి ఒక్కరూ మీముందు సహయొగమనే కానుకను ఆఫర్ చేస్తారు. ఎవరికైతే స్వయముపై రాజ్యము ఉంటుందో వారి ముందు లౌకిక-అలౌకిక సహచరలు జీ హాజిర్, జీ హుజూర్, హా జీ అంటూ స్నేహులుగా-సహయోగులుగా అవుతారు. పరివారములో ఎప్పుడూ ఆర్డర్ చేయకండి, మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకొన్నట్లయితే మీ సర్వ సహచరులు మీ స్నేహీ, సహయోగులుగా అయిపోతారు.
స్లొగన్: సర్వ ప్రాప్తుల సాధనాలు ఉన్నాకూడా వృత్తి అతీతముగా ఉండాలి, అప్పుడే వైరాగ్య వృత్తి అని అంటారు.
No comments:
Post a Comment