Thursday, August 6, 2009

అధర్మయుక్తమైన ప్రేమ ఏమిటి మరియు దాని పరిణామం ఏమిటి?

"మధురమైన పిల్లలూ - వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశీ తండ్రిపై ప్రేమను ఉంచండి, తద్వారా రోదనల నుండి విముక్తులైపోతారు."

ప్రశ్న: అధర్మయుక్తమైన ప్రేమ ఏమిటి మరియు దాని పరిణామం ఏమిటి?

జవాబు: వినాశీ శరీరాలపై మోహమును ఉంచడం అధర్మయుక్తమైన ప్రేమ. ఎవరైతే వినాశీ వస్తువులపై మోహమును ఉంచుతారో వారు రోదిస్తారు. దేహాభిమానం కారణముగా ఏడుపు వస్తుంది. సత్యయుగములో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు, కావున అక్కడ ఏడవడం విషయమే ఉండదు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవినాశీ తండ్రికి చెందిన అవినాశీ పిల్లల్లు ఇప్పుడు దేహీ అభిమానులుగా అయినట్లయితే ఏడవడం నుండి విముక్తులైపోతారు అని శిక్షణ లభిస్తుంది.

ధారణ:
1. మీ స్మృతితో కూడిన ప్రతి అడుగులోనూ పదమాపదముల సంపాదన ఉంది, దీని ద్వారానే అమర పదవిని పొందాలి, అవినాశీ జ్ఞానరత్నాలేవైతే తండ్రి ద్వారా లభిస్తాయో వాటిని దానం చేయాలి.
2. ఆత్మాభిమానిగా అయ్యి అపారమైన సుఖాన్ని అనుభవం చేసుకోవాలి. శరీరాల నుండి మోహాన్ని తొలగించుకొని సదా హర్షితముగా ఉండాలి, మోహాజీతులుగా అవ్వాలి.

వరదానము -
ప్రతి అడుగులో వరదాత నుండి వరదానమును ప్రాప్తి చేసుకొని శ్రమనుండి ముక్తులుగా ఉండే అధికారీ ఆత్మా భవ.
ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో, వారికి ప్రతి అడుగులో వరదాతనుండి వరదానములు స్వతహాగానే లభిస్తాయి. వరదానమే వారి పాలన. వరదానాల పాలనతోనే పోషింపబడతారు. కష్టము లేకుండానే ఇంతటి శ్రేష్ట ప్రాప్తులు లభించటము - దీనినే వరదానము అని అంటారు. కావున జన్మజనలకు ప్రాప్తుల అధికారులుగా అయిపోతారు. ప్రతి అడుగులో వరదత నుండి వరదానము లభిస్తూ ఉంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది. అధికారీ ఆత్మకు దృష్టి నుండి, మాటనుండి, సంబంధమునుండి వరదానమే వరదానము లభిస్తూ ఉంటుంది.

స్లొగన్: సమయపువేగము ప్రమాణంగా పురుషార్ధపు వేగమును తీవ్రము చేయ్యండి.

No comments:

Post a Comment