"మధురమైన పిల్లలూ - మీరు పవిత్రముగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళజాలరు, కావున బాబా స్మృతిద్వారా ఆత్మరూపీ బ్యాటరీని చార్జ్ చేసుకోండి మరియు సహజముగా పవిత్రముగా అవ్వండి."
ప్రశ్న: ఇంటికి వెళ్ళేముందు పిల్లలైన మీకు బాబా ఏ విషయాన్ని నేర్పిస్తారు?
జవాబు: పిల్లలూ, ఇంటికి వెళ్ళేముందు జీవిస్తూనే మరణించాలి. అందుకొరకు బాబా మీకు మొదటినుండే దేహపు అభిమానము నుండి అతీతముగా వెళ్ళే అభ్యాసము చేయిస్తారు. అనగా మరణించడమును నేర్పిస్తారు. పైకి వెళ్ళడము అనగా మరణించడము. వెళ్ళడము మరియు రావడముల జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది. ఆత్మ అయిన మనం పైనుండి వచ్చామని, ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. నిజానికి మనం అక్కడి నివాసులము, ఇప్పుడు మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళాలి.
ధారణ:
1. ఈ శరీరరూపీ వస్త్రముపై మమకారాన్ని తొలగించుకొని జీవిస్తూనే మరణించాలి అనగా మీ పాత లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి.
2. డబుల్ కిరీటధారులుగా అయ్యేందుకు, బాగా చదివేందుకు కష్టపడాలి, దైవీగుణాలను ధారణ చేయాలి. లక్ష్యము ఎలా ఉందో శుభమైన మాటలు ఏవైతే ఉన్నాయో అలా పురుషార్ధము కూడా చేయాలి.
వరదానము - ఉన్నతుడైన తండ్రి, ఉన్నతమైన మేము మరియు ఉన్నతమైన కార్యము ఈ స్మృతిద్వారా శక్తిశాలిగా అయ్యే బాబా సమాన భవ.
ఏవిధంగా ఈ నాటి ప్రపంచములో ఎవరైనా వి.ఐ.పి ల పిల్లలు ఉన్నట్లయితే వారు తమనుకూడా వి.ఐ.పి గా భావిస్తారు. కానీ తండ్రి కంటే ఉన్నతమయినవారు ఎవ్వరూ లేరు. మేము అటువంటి ఉన్నతోన్నతుడైన తండ్రి సంతానమైన ఉన్నత ఆత్మలము - అన్న ఇటువంటి స్మృతి శక్తిశాలిగా తయారు చేస్తుంది. ఉన్నతుడైన తండ్రి, ఉన్నతమైన మేము మరియు ఉన్నతమైన కార్యము - అన్న ఇటువంటి స్మృతిలో ఉండేవారు సదా తండ్రి సమానంగా అవుతారు. మొత్తము విశ్వములో శ్రేష్టమైన మరియు ఉన్నతమైన ఆత్మలు మీరు తప్ప మరెవ్వరూ లేరు, కావున మీ గాయనము మరియు పూజయే జరుగుతుంది.
స్లొగన్: సంపూర్ణతాదర్పణములో సూక్ష్మ ఆకర్షణలను పరిశీలించుకోండి మరియు ముక్తులుగా అవ్వండి.
No comments:
Post a Comment