"మధురమైన పిల్లలూ - ఈ బ్రహ్మ సద్గురువు దర్బారు, ఈ భృకుటిలో సద్గురువు విరాజమానమై ఉన్నారు, వారే పిల్లలైన మీ సద్గతిని చేస్తారు."
ప్రశ్న: తండ్రి తమ పిల్లలను ఏ బానిసత్వమునుండి విడిపించేందుకు వచ్చారు?
జవాబు: ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలుగా అయిపోయారు. తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వమునుండి విడిపిస్తారు. ఇప్పుడు మాయ మరియు ప్రక్రుతి రెండూ విసిగిస్తాయి. ఒకసారి తుఫానులు మరోసారి కరువులు! ఆ తర్వాత మీరు ఎటువంటి అధిపతులుగా అయిపోతారంటే మొత్తం ప్రక్రుతి అంతా మీ దాసిగా ఉంటుంది, మాయ యుద్ధము కూడా జరుగదు.
ధారణ:
1. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానినే వినాలి మరియు ఏది సరైనదో నిర్ణయించుకోవాలి సత్యమునే స్మృతిచేయాలి, చెడు విషయాలను వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు.
2. చదువును బాగా చదువుకొని స్వయాన్ని రాజాధిరాజులుగా తయారుచేసుకోవాలి, ఈ పాత శరీరము మరియు పాత ప్రపంచములో స్వయం తాత్కాలికముగా ఉంటున్నాము అని భావించాలి.
వరదానము - శక్తిశాలీ స్మృతిద్వారా క్షణములో కోటానురెట్ల సంపాదనను జమ చేసుకొని పదమాపదమభాగ్యశాలీ భవ.
స్లొగన్: డ్రామాలో అంతా మంచిగానే అవ్వనుంది - అన్న ఈ స్మృతిద్వారా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి.
No comments:
Post a Comment