Sunday, August 9, 2009

"పరిస్థితులను దాటేందుకు సాధనము స్వస్థితి."

అవ్యక్త బాప్ దాదా రివైజ్ తేది: 11-03-1971

"పరిస్థితులను దాటేందుకు సాధనము స్వస్థితి."

వరదానము: జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రునికి సహచరులుగా అయ్యి రాత్రిని పగలుగా తయారుచేసే ఆత్మిక జ్ఞాన సితార భవ.

ఏ విధంగా ఆ సితారలు (నక్షత్రాలు) రాత్రిపూట ప్రత్యక్షమవుతాయో అలా జ్ఞాన సితారలు, ప్రకాశిస్తున్న సితారలైన మీరు కూడా బ్రహ్మ రాత్రిలో ప్రత్యక్షమవుతారు. ఆ సితారలు రాత్రిని పగలుగా తయారు చెయ్యవు, కానీ మీరు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రునికి సహచరులుగా అయ్యి రాత్రిని పగలుగా తయారుచేస్తారు. అవి ఆకాశ సితారలు, మీరు ధరిత్రి సితారలు, అవి ప్రకృతి శక్తులు, మీరు పరమాత్మ సితారలు. ఏ విధంగా ప్రకృతి తారామండలములో అనేక రకాలైన సితారలు ప్రకాశిస్తూ కనిపిస్తుంటాయో అలా మీరు పరమాత్మ తారామండలంలో ప్రకాశిస్తున్న ఆత్మిక సితారలు.

స్లొగన్: సేవా చాన్స్ లభించటము అనగా ఆశీర్వాదాలతో ఒడిని నింపుకోవటము.

No comments:

Post a Comment