"మధురమైన పిల్లలూ - ఈ ఉన్నతోన్నతుడైన తండ్రి గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను ఇవ్వరు. కేవలం అలఫ్ మరియు బే (బాబా మరియు వారసత్వము) అనే ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి."
ప్రశ్న: ఆత్మిక తండ్రికి ఆనందమును కలిగించే తమ ముఖ్య కర్తవ్యము ఏమిటి?
జవాబు: పతితులను పావనులుగా చేయడం ఆత్మిక తండ్రి యొక్క ముఖ్య కర్తవ్యము. బాబాకు పావనముగా తయారుచేయడంలోనే ఎంతో ఆనందం కలుగుతుంది. పిల్లలకు సద్గతినిచ్చేందుకు, అందరినీ సతోప్రధానముగా తయారుచేసేందుకే తండ్రి వస్తారు. ఎందుకంటే, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. మేము దేహము కాదు, మేము ఒక ఆత్మ అన్న ఈ ఒక్క పాఠమును పక్కా చేసుకోండి. ఈ పాఠము ద్వారానే బాబా స్మృతి ఉంటుంది మరియు పావనముగా అవుతారు.
ధారణ:
1. ఫుల్ మార్కులతో పాస్ అయ్యేందుకు మీ బుద్ధిని సతోప్రధానముగా, పారసముగా తయారుచేసుకోవాలి. మందబుద్ధినుండి సూక్ష్మ బుద్ధి కలవారిగా అయి డ్రామా విచిత్ర రహస్యాన్ని అర్ధం చేసుకోవాలి.
2. ఇప్పుడు బాబా సమానముగా దివ్యమైన మరియు అలౌకికమైన కర్మను చేయాలి. డబుల్ అహింసకులుగా అయి యోగబలము ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకోవాలి.
వరదానం: మీ పురుషార్ధపు విధిలో స్వయము యొక్క ప్రగతిని అనుభవము చేసుకునే సఫలతా సితారభవ.
ఎవరైతే వారి పురుషార్ధపు విధిలో స్వయముయొక్క ప్రగతిని లేక సఫలతను అనుభవము చేస్తారో వారే సఫలతా సితారలు, వారి సంకల్పములో స్వపురుషార్ధముపట్ల కూడా ఎప్పుడూ "అవుతుందో లేదో తెలియదు, చెయ్యగలమో లేక చెయ్యలేమో" - అన్న ఇటువంటి అసఫలత అంశమాత్రముకూడా ఉండదు. స్వయముపట్ల సఫలతను అధికారము రూపములో అనుభవము చేసుకుంటారు. వారికి సహజంగా మరియు స్వతహాగనే సఫలత లభిస్తూ ఉంటుంది.
స్లొగన్: సుఖ స్వరూపులుగా అయ్యి సుఖమును ఇచ్చినట్లయితే పురుషార్ధములో ఆశీర్వాదములు అదనంగా లభిస్తాయి.
No comments:
Post a Comment