"మధురమైన పిల్లలూ - దు:ఖహర్త, సుఖకర్త అయిన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దు:ఖాలన్నీ దూరమయిపోతాయి, అంతిమమతిని బట్టి గతి ఏర్పడుతుంది."
ప్రశ్న: పిల్లలైన మీకు నడుస్తూ, తిరుగుతూ స్మృతిలో ఉండాలి అనే డైరెక్షన్ ను బాబా ఎందుకు ఇచ్చ్చారు?
జవాబు: 1. ఎందుకంటే - స్మృతి ద్వారానే జన్మజన్మాంతరాల పాపాల భారము తొలగుతుంది.
2. స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానముగా అవుతుంది.
3. ఇప్పటినుండే స్మృతిలో ఉండే అభ్యాసము ఉన్నట్లయితే చివరి సమయంలో ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండగలుగుతారు. 'అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో..' అన్న గాయనము అంత్యకాలము కొరకే ఉంది.
4. తండ్రిని స్మృతి చేయడం ద్వారా 21 జన్మల సుఖాలు మీ ముందుకు వచ్చేస్తాయి. తండ్రి వంటి మధురమైనవారు ఈ ప్రపంచములో ఎవరూ లేరు కావున పిల్లలూ నడుస్తూ తిరుగుతూ మీరు నన్నే స్మృతిచేస్తూ ఉండండి అని తండ్రి డైరక్షన్ ను ఇచ్చారు.
ధారణ:
1. ఈ కనుల ద్వారా అశుద్ధతను చూడకూడదు. తండ్రి జ్ఞానమనే మూడవనేత్రమునేదైతే ఇచ్చారో ఆ శుద్ధమైన నేత్రము ద్వారానే చూడాలి. సతోప్రధానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్ధం చేయాలి.
2. గృహస్థ వ్యవహారమును సంభాళిస్తూ ప్రియమైన తండ్రిని స్మృతిచేయాలి. అంత్యకాలములో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాని విధంగా స్థితిని తయారు చేసుకోవాలి.
వరదానము - బిందురూపములో స్థితులై ఇతరులను కూడా డ్రామా బిందువు స్మృతిని కలిగించే విఘ్న వినాశక భవ.
ఏ పిల్లలయితే ఏ విషయములోనూ ప్రశ్నార్ధకమును పెట్టరో, సదా బిందురూపములో స్థితులై ప్రతి కార్యములో ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని కలిగిస్తారో - వారినే విఘ్న వినాశకులు అని అంటారు. వారు ఇతరులను కూడా సమర్ధులుగా తయారు చేసే సఫలతా గమ్యమునకు సమీపంగా తీసుకువస్తారు. వారు హద్దు ప్రాప్తులను చూసి సంతోషించరు, వారు అనంతమైన సఫలతామూర్తులుగా ఉంటారు. సదా ఏకరసంగా, ఒకటే శ్రేష్ట స్థితిలో స్థితులై ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వస్థితిద్వారా అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు.
స్లొగన్: ఆశీర్వాదములను తీసుకుంటూ, ఆశీర్వాదములను ఇస్తూ ఉన్నట్లయితే చాలా త్వరగా మాయాజీతులుగా అయిపోతారు.
No comments:
Post a Comment