"మధురమైన పిల్లలూ - బాబా మీకు సంగమయుగములో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేయండి. అప్పుడు సదా హర్షితముగా ఉంటారు."
ప్రశ్న: సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి? ఏ సాధనమును ధారణ చేయడం ద్వారా సంతోషములో ఉండగలుగుతారు?
జవాబు: సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలైతే జరిగాయో వాటన్నింటినీ అవినాశీ సర్జన్ ముందు పెట్టండి. జన్మజన్మాంతరాల పాపాలేవైతే శిరస్సుపై ఉన్నాయో వాటికొరకు స్మృతియాత్రలో ఉండండి. స్మృతిద్వారానే పాపాలు అంతమవుతాయి, మళ్ళీ సంతోషము ఉంటుంది. బాబా స్మృతిద్వారా ఆత్మ సతోప్రధానముగా అయిపోతుంది.
ధారణ:
1. డ్రామా ఆదిమధ్యాంతాలను బాగా అర్ధం చేసుకొని, స్మృతిలో ఉంచుకొని ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. జ్ఞానమనే అంజనమును ఇచ్చి అజ్ఞానాంధకారమును దూరం చేయాలి.
2. బ్రహ్మబాబా సమానముగా బలిహారమవ్వడంలో పూర్తిగా ఫాలో చేయాలి. శరీరసహితముగా అన్నీ అంతమవనున్నాయి, కావున అంతకుముందే జీవిస్తూనే మరణించాలి, తద్వారా అంత్య సమయంలో ఏమీ గుర్తుకురాకూడదు.
వరదానము - విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసే నిర్విఘ్న విజయీ భవ.
విఘ్నాలు రావటమన్నది మంచి విషయమే కానీ విఘ్నాలు ఓటమిని చవిచూపించకూడదు. దృడంగా తయారుచేసేందుకే విఘ్నాలు వస్తాయి, కావున విఘ్నాలతో గాభరా చెందేందుకు బదులుగా వాటిని మనోరంజకమైన ఆటగా భావించి దాటివేసినట్లయితే నిర్విఘ్న విజయులు అని అంటారు. సర్వ శక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నప్పుడు గాభరా చెందే విషయమే లేదు. కేవలము తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నము లేక మాయ వస్తుంది, బిజీగా ఉన్నట్లయితే మాయ లేక విఘ్నము దూరమైపోతుంది.
స్లొగన్: సుఖపు ఖాతాను జమ చేసుకొనేందుకు మర్యాదపూర్వకంగా హృదయమునుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి.
No comments:
Post a Comment