"మధురమైన పిల్లలూ - ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి, కావున బాబాను స్మృతి చేసేందుకు మరియు మీ చరిత్రను తీర్చిదిద్దుకునేందుకు శ్రమించండి."
ప్రశ్న: అజ్ఞాన నిదురలో నిదురింపచేసే విషయం ఏది? దానివల్ల కలిగిన నష్టం ఏమిటి?
జవాబు: కల్పం ఆయువును లక్షల సంవత్సరాలు అని అనడమే అజ్ఞానపు నిదురలో నిదురింపచేసిన విషయం. దీనివల్ల జ్ఞాననేత్ర హీనులుగా అయిపోయారు. ఇంటిని చాలా దూరముగా భావిస్తారు. ఇప్పుడింకా లక్షల సంవత్సరాల వరకూ ఇదే సుఖ, దు:ఖాల పాత్రను అభినయించాలి అని బుద్ధిలో ఉంది, కావున పావనులుగా అయ్యేందుకు కష్టపడరు, ఇప్పుడు ఇల్లు చాలా సమీపముగా ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం కష్టపడి కర్మాతీతులుగా అవ్వాలి.
ధారణ:
1. నరుని నుండి నారాయణ పదవిని ప్రాప్తించుకునేందుకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన పాఠమును నేర్చుకొని ఇతరులను చదివించాలి, మీ సమానముగా తయారుచేసే సేవను చేయాలి.
2. లోభపు, మోహపు, బంధాలేవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకునేందుకు కష్టపడాలి, మీ చరిత్రను ఏ భూతమూ లోపలకు ప్రవేశించని విధంగా తీర్చిదిద్దుకోవాలి.
వరదానము - సదా ఆత్మిక స్థితిలో ఉండి ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ.
ఎవరిలో అయితే సదా ఆత్మిక సుగంధము ఉంటుందో వారే ఆత్మిక గులాబీలు. ఆత్మిక సుగంధము కలిగినవారు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా శరీరమును కాకుండా ఆత్మనే చూస్తారు, కావున స్వయముకూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి మరియు ఇతరులను కూడా ఆత్మగా చూడండి. తండ్రి ఏవిధంగా ఉన్నతోన్నతమైనవారో, అలా వారి తోటకూడా ఉన్నతోన్నతమైనది, ఆ తోటకు విశేషమైన అలంకారము ఆత్మిక గులాబీలగు పిల్లలైన మీరే, మీ ఆత్మిక సుగంధము అనేక ఆత్మల కల్యాణము చేస్తుంది.
స్లొగన్: మర్యాదను భంగపరిచి ఎవరికైనా సుఖమును ఇచ్చినట్లయితే అది కూడా దు:ఖపు ఖాతాలో జమ అయిపోతుంది.
No comments:
Post a Comment