Friday, August 14, 2009

మీ కొత్త రాజధానిలో ఎటువంటి అశాంతీ ఉండజాలదు ఎందుకు?

"మధురమైన పిల్లలూ - యోగము ద్వారా తత్వాలను పావనంగా తయారుచేసే సేవను చేయండి, ఎందుకంటే ఎప్పుడైతే తత్వాలు పావనంగా అవుతాయో అప్పుడే దేవతలు ఈ సృష్టిపై తమ పాదమును మోపుతారు"

ప్రశ్న: మీ కొత్త రాజధానిలో ఎటువంటి అశాంతీ ఉండజాలదు ఎందుకు?

జవాబు:
1. ఎందుకంటే ఆ రాజ్యం మీకు బాబా ద్వారా వారసత్వములో లభించింది.
2. వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానమును అనగా వారసత్వమును ఇచ్చేసారు, ఆ కారణముగా అక్కడ అశాంతి ఉండజాలదు. మీరు బాబాకు చెందినవారిగా అవుతారు కాబట్టి మొత్తం వారసత్వమంతటినీ తీసుకుంటారు.

ధారణ:
1. మీ హృదయపు స్వచ్చత ద్వారా తండ్రి అధ్బుతమైన జ్ఞానమును జీవితంలో ధారణ చేయాలి, పురుషార్ధం ద్వారా ఉన్నతమైన ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి,డ్రామా అని కూర్చుండిపోకూడదు.

2. రావణరాజ్యములో అశుధ్ధ దృష్టి మోసమునుండి సురక్షితులుగా అయ్యేందుకు జ్ఞానపు మూడవనేత్రముద్వారా చూసే అభ్యాసము చేయాలి. నెంబర్ వన్ క్యారెక్టర్ అయిన పవిత్రతనే ధారణ చేయాలి.

వరదానము: కర్మ మరియు యోగముల బ్యాలెన్సు ద్వారా కర్మాతీత స్థితిని అనుభవము చేసే కర్మబంధన ముక్తభవ.

కర్మతోపాటు యోగము యొక్క బ్యాలెన్సు కూడా ఉన్నట్లయితే ప్రతి కర్మలో స్వతహాగనే సఫలత ప్రాప్తిస్తుంది, కర్మయోగీ ఆత్మ ఎప్పుడూ కర్మబంధనములో ఇరుక్కోదు. కర్మ బంధనమునుండి ముక్తి అవ్వటమునే కర్మాతీతము అని అంటారు. కర్మాతీతము అనగా కర్మ నుండి అతీతమై పోవటమని కాదు. కర్మ నుండి అతీతము కాదు, కర్మ బంధనములో ఇరుక్కోవటము నుండి అతీతముగా అవ్వండి. ఇటువంటి కర్మయోగీ ఆత్మలు తమ కర్మతో అనేకుల కర్మను శ్రేష్టముగా తయారుచేసేవారుగా ఉంటారు. వారికి ప్రతి కర్మ మనోరంజకముగా అనిపిస్తుంది, కష్టమన్న అనుభవము ఉండదు.

స్లొగన్: పరమాత్మ ప్రేమయే సమయపు గంట, అది అమృతవేళ లేపుతుంది.

No comments:

Post a Comment