"మధురమైన పిల్లలూ - మీ అనాది సంబంధం సోదర సంబంధం, మీరు సాకారములో సోదరీ, సోదరులు, కావున మీ దృష్టి ఎప్పుడూ అశుధ్ధముగా అవ్వడానికి వీల్లేదు."
ప్రశ్న: విజయీ అష్టరత్నాలుగా ఎవరు అవుతారు? వారి విలువ ఏమిటి?
జవాబు: ఎవరి మనస్సులో అయితే వికారీ ఆలోచనలు ఉండవో, పూర్తి శుద్ధత వచ్చేస్తుందో వారే అష్టరత్నాలుగా అవుతారు అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. వారికి ఎంత ఎక్కువ విలువ ఉంటుందంటే ఎప్పుడైనా, ఎవరిపైన అయినా గ్రహచారం కూర్చుంటే వారికి అష్టరత్నాల ఉంగరాన్ని ధరింపచేస్తారు, తద్వారా గ్రహచారం తొలగిపోతుంది అని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యేవారు దూరదృష్టికలవారిగా ఉన్న కారణముగా ఆత్మరూపీ సోదరలము అన్న స్మృతిలో నిరంతరమూ ఉంటారు.
ధారణ:
1. బాబాకు ఇష్టమైనవారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి, మంచి గుణాలను ధారణ చేసి పుష్పాలుగా అవ్వాలి, అవగుణాలను తొలగించి వేయాలి. ఎవరికీ ముళ్ళను గుచ్చకూడదు.
2. ఫుల్ పాస్ గా అయ్యేందుకు లేక స్కాలర్ షిప్ ను తీసుకునేందుకు ఇంకేమీ గుర్తుకురాని విధముగా స్థితిని తయారుచేసుకోవాలి. పూర్తిగా దృష్టి శుద్ధమైపోవాలి. సదా బృహస్పతి దశ నిలిచి ఉండాలి.
వరదానము - దయా భావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే సర్వ ఆకర్షణ ముక్త భవ.
వర్తమాన సమయములో ఆత్మలందరూ అలసిపోయి నిరాశకు లోనై దయను కోరుకుంటున్నారు, కావున దాత పిల్లలైన మీరు మీ సోదరీసోదరులపట్ల దయాహృదయులుగా అవ్వండి. ఎవరు ఎంత చెడ్డవారుగా ఉన్నాగానీ, వారిపట్లకూడా దయాభవన ఉన్నట్లయితే ద్వేషము, ఈర్ష్య, క్రోధపు భావన రాదు. దయా భావన సహజంగానే నిమిత్తభావనను ఇమర్జ్ చేసేస్తుంది, లగావ్ (ఆకర్షణ)తో దయ కాదు కానీ సత్యమైన దయ ఆకర్షణాముక్తముగా తయారుచేస్తుంది. ఎందుకంటే వారిలో దేహభావము ఉండదు.
స్లొగన్: ఇతరులకు సహయోగమును ఇవ్వటమే స్వయము యొక్క ఖాతాను జమ చేసుకోవటము.
No comments:
Post a Comment