Monday, August 17, 2009

బాబా ఒకేవిషయాన్ని పదే, పదే అర్ధం చేయించవలసిన అవసరం ఎందుకు వస్తుంది?

"మధురమైన పిల్లలూ - విదేహీ తండ్రినగు నేను దేహధారులైన మిమ్మల్ని విదేహులుగా తయారుచేసేందుకు చదివిస్తాను, ఇది కొత్త విషయము, దీనిని పిల్లలే అర్ధం చేసుకోగలరు."

ప్రశ్న: బాబా ఒకేవిషయాన్ని పదే, పదే అర్ధం చేయించవలసిన అవసరం ఎందుకు వస్తుంది?

జవాబు: ఎందుకంటే పిల్లలు ఘడియ, ఘడియ మర్చిపోతారు. కొంతమంది పిల్లలు బాబా అయితే అదే విషయాన్ని పదే, పదే అర్ధం చేయిస్తారు అని అంటారు. పిల్లలూ, నేను తప్పకుండా అదే విషయాన్ని పదే, పదే వినిపించవలసి వస్తుంది, ఎందుకంటే మీరు మరిచిపోతూ ఉంటారు. మిమ్మల్ని మాయ తుఫానులు హైరానా పరుస్తూ ఉంటాయి. నేను మిమ్మల్ని రోజూ అప్రమత్తం చేయకపోతే మీరు మాయ తుఫానులలో పడి ఓడిపోతారు అని బాబా అంటారు. ఇప్పటివరకూ మీరు ఇంకా సతోప్రధానులుగా ఎక్కడ అయ్యారు? ఎప్పుడైతే అలా అయిపోతారో అప్పుడు ఇక వినిపించడం ఆపేస్తాను అని బాబా అంటారు.

ధారణ:
1. జ్ఞానమనే మూడవనేత్రం ద్వారా ఆత్మనే చూడాలి. అసలు దైహికమైన నేత్రాలతో చూడనే చూడకూడదు. అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయాలి.

2. బాబా స్మృతిద్వారా మీ దైవీ నడవడికను తయారు చేసుకోవాలి. నేను ఎంతవరకూ గుణవంతుడిగా అయ్యాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. రోజంతటిలో నా నడవడిక అసురీగా లేదు కదా! అని చూసుకోవాలి.

వరదానము: జ్ఞాన సంపన్న దాతగా అయ్యి సర్వ ఆత్మలపట్ల శుభచింతకులుగా అయ్యే శ్రేష్ట సేవాధారీ భవ.

శుభచింతకులుగా అయ్యేందుకు విశేష ఆధారము - శుభచింతన. ఎవరైతే వ్యర్ధ చింతన లేక పరచింతన చేస్తారో వారు శుభచింతకులుగా అవ్వజాలరు. శుభచింతకమణుల వద్ద శుభచింతన యొక్క శక్తిశాలీ ఖజానా సదా నిండుగా ఉంటుంది. నిండుతనము కారణంగానే ఇతరులపట్ల శుభచింతకులుగా అవ్వగలరు. శుభచింతకులు అనగా సర్వ జ్ఞాన రత్నాలతో నిండుగా ఉండటము, ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ - తిరుగుతూ ప్రతిఒక్కరి సేవ చేస్తూ శ్రేష్ట సేవాధారులుగా అయిపోతారు.

స్లొగన్: విశ్వరాజ్య అధికారిగా అవ్వలనుకుంటే విశ్వపరివర్తనా కార్యములో నిమిత్తులవ్వండి

No comments:

Post a Comment