Wednesday, August 19, 2009

ఏ రెండు పదాల స్మృతిద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు?

"మధురమైన పిల్లలూ - జ్ఞాన ధారణను చేస్తూ ఉన్నట్లయితే అంతిమంలో మీరు బాబా సమానముగా అయిపోతారు, బాబా శక్తినంతటినీ మీరు జీర్ణం చేసుకుంటారు."

ప్రశ్న: ఏ రెండు పదాల స్మృతిద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు?

జవాబు: ఉన్నతి మరియు పతనము. సతోప్రధానము మరియు తమోప్రధానము. శివాలయము మరియు వేశ్యాలయము. ఈ రెండూ రెండు విషయాలు స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు. పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని యధార్ధరీతిగా తెలుసుకున్నారు. భక్తిలో జ్ఞానము లేదు. కేవలం మనస్సును ఆహ్లాధింపచేసే మాటలనే మాట్లాడుతూ ఉంటారు. భక్తి మార్గము మనస్సును సంతోషపెట్టే మార్గం మాత్రమే.

ధారణ:
1. ఈ అంతిమ జన్మలో సర్వప్రాప్తులనూ మీ ముందుంచుకొని పావనంగా అయి చూపించాలి. మాయ విఘ్నాలతో ఓడిపోకూడదు.

2. లక్ష్యమును మరియు ఉద్దేశ్యమును మీ ముందు ఉంచుకొని పూర్తిగా పురుషార్ధమును చేయాలి. ఏ విధంగా బ్రహ్మబాబా పురుషార్ధము చేసి నరుని నుండి నారాయణునిగా అవుతారో అలా బాబాను అనుసరించి సిం హాసనాధికారులుగా అవ్వాలి. ఆత్మను సతోప్రధానముగా చేసేందుకు కష్టపడాలి.

వరదానము: సదా ఏకరసమైన మూడ్ ద్వారా సర్వ ఆత్మలకు సుఖము-శాంతి-ప్రేమల అంచలిని ఇచ్చే మహాదానీ భవ.

పిల్లలైన మీ మూడ్ సదా సంతోషముతో కూడి ఏకరసంగా ఉండాలి, ఒక్కో సారి మూడ్ ఆఫ్ అవ్వటము(మనస్సు పాడవటము), ఒక్కో సారి మూడ్ చాలా సంతోషముగా ఉండటము.... ఇలా ఉండకూడదు. సదా మహాదానులుగా అయ్యే వారి మూడ్ ఎప్పుడూ మారదు. దేవతగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. మీకు ఎవరు ఏం ఇచ్చినా కానీ మహాదానీ పిల్లలైన మీరు అందరికీ సుఖపు అంచలిని (దోసిలి నిండుగా దానమిచ్చుట), శాంతి అంచలిని, ప్రేమ అంచలిని ఇవ్వండి. తనువు సేవతో పాటు మనస్సు ద్వారా ఇటువంటి సేవలో బిజీ అయినట్లయితే డబుల్ పుణ్యము జమ అయిపోతుంది.

స్లొగన్: మీ విశేషతలు ప్రభు ప్రసాదము, వాటిని కేవలము స్వయము కొరకు ఉపయోగించకండి, పంచండి మరియు పెంచండి

No comments:

Post a Comment