"మధురమైన పిల్లలూ - కార్యవ్యవహారాలు చూసుకుంటూ కూడా ఒక్క బాబా స్మృతి ఉండాలి, నడుస్తూ, తిరుగుతూ బాబాను మరియు ఇంటిని స్మృతి చేయాలి, ఇదే మీ సాహసము."
ప్రశ్న: బాబా గౌరవము మరియు అగౌరవము ఎప్పుడు జరుగుతుంది మరియు ఎలా జరుగుతుంది?
జవాబు: ఎప్పుడైతే పిల్లలైన మీరు బాబాను బాగా స్మృతి చేస్తారో అప్పుడు గౌరవమును ఇస్తారు. స్మృతి చేసేందుకు సమయం లేదు అని ఎప్పుడైతే అంటారో అది అగౌరవపరిచినట్లు. నిజానికి అది బాబాను అగౌరవపరచడంకాదు, మిమ్మల్ని మీరు అగౌరవపరచుకోవడమే. కావున కేవలం భాషణ ఇవ్వడంలో ప్రసిద్దులుగా అవ్వడం కాదు, స్మృతియాత్రలో ప్రసిద్ధులుగా అవ్వండి, స్మృతి చార్ట్ ను వ్రాయండి. స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది.
ధారణ:
1. సర్వశక్తివంతుడైన బాబా నుండి శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్ట్ ను పెంచాలి. స్మృతికోసం భిన్న భిన్న యుక్తులను రచించాలి, ఏకాంతంలో కూర్చొని విశేష సంపాదనను జమ చేసుకోవాలి.
2. సతోప్రధానులుగా అవ్వాలి అన్న తపనను ఉంచాలి, పొరపాట్లు చేయకూడదు, అహంకారంలోకి రాకూడదు. సేవ అభిరుచిని కూడా కలిగి ఉండాలి, అలాగే స్మృతియాత్రలో కూడా ఉండాలి.
వరదానము: ఈ అంతిమజన్మలో లభించిన సర్వ శక్తులను ఉంపయోగించుకొనే విల్ పవర్ సంపన్న భవ.
ఈ మధురమైన డ్రామా చాలా మంచిగా తయారై ఉంది, దీనిని ఎవ్వరూ మార్చజాలరు. కానీ డ్రామాలో ఈ శ్రేష్ట బ్రాహ్మణ జన్మకు చాలా శక్తులు లభించి ఉన్నాయి. బాబా విల్ అనగా తన దగ్గరున్నదంతా వీలునామా వ్రాసేసారు, కావుననే విల్ పవర్ ఉంది. ఈ శక్తిని ఉపయోగించుకోండి - ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ శరీర బంధనమునుండి అతీతమై కర్మాతీత స్థితిలో స్థితులైపోండి. అతీతముగా ఉన్నాను, యజమానిని, తండ్రిద్వారా నిమిత్త ఆత్మను - ఈ స్మృతితో మనస్సును - బుద్ధిని ఏకాగ్రము చెయ్యండి, అప్పుడే విల్ పవర్ సంపన్నులు అని అంటారు.
No comments:
Post a Comment