"మధురమైన పిల్లలూ - స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తి ధ్యానమును ఉంచాలి, స్మృతి ద్వారా పావనముగా అవుతారు మరియు చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు."
ప్రశ్న: స్కాలర్ షిప్ ను తీసుకునేందుకు ఏ పురుషార్ధము అవసరము?
జవాబు: స్కాలర్ షిప్ తీసుకోవలంటే అన్ని విషయాలనుండి మమకారాన్ని తొలగించివేయండి. ధనము, పిల్లలు, ఇళ్ళు మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు. శివబాబాయే గుర్తుండాలి. పూర్తిగా స్వాహా అవ్వాలి, అప్పుడే ఉన్నత పదవి ప్రాప్తి లభిస్తుంది. మేము ఎంతో పెద్ద పరీక్షను పాస్ అవుతున్నాము, మాది ఎంత పెద్ద చదువు మరియు చదివించేవారు స్వయంగా దు:ఖహర్త, సుఖకర్త అయిన తండ్రియే, ఆ అతి మధురమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నషా బుద్ధిలో ఉండాలి.
ధారణ:
1. మీ బుద్ధిని బాగా తీర్చిదిద్దుకునేందుకు రోజూ జ్ఞానామృతపు డోస్ ను ఇవ్వాలి. స్మృతితోపాటు చదువుపై కూడా పూర్తి ధ్యానమును తప్పకుండా ఉంచాలి, ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది.
2. మనం ఉన్నతమైన కులానికి చెందినవారము, స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అన్న ఈ నషాలో ఉండాలి. జ్ఞానమును ధారణ చేసి ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి.
వరదానము: సర్వ సత్తాలను సహయోగిగా తయారుచేసుకొని ప్రత్యక్ష్యత అనే పరదాను తెరిచే సత్యమైన సేవాధారీ భవ.
ఎప్పుడైతే అన్ని సత్తాలు(శక్తులు) కలవారందరూ కలసి శ్రేష్ట సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా అంటే ఈ ఒక్క పరమాత్మ సత్తానే అని అంటారో అప్పుడే ప్రత్యక్ష్యత రూపీ పరదా తెరచుకుంటుంది. అందరూ ఒక్క స్టేజ్ పై కలిసేటట్లుగా అటువంటి స్నేహ మిలనమును చెయ్యాలి, ఇందుకొరకు అందరినీ స్నేహ సూత్రములో బంధించి సమీపముగా తీసుకురండి, సహయోగులుగా తయారుచెయ్యండి. ఆ స్నేహమే అయస్కాంతముగా అవుతుంది, అందరూ ఒక్కసారిగా సంగఠిత రూపంలో తండ్రి స్టేజ్ పైకి చేరుకుంటారు. కావున ఇప్పుడు అంతిమ ప్రత్యక్ష్యత యొక్క హీరో పాత్రలో నిమిత్తముగా అయ్యే సేవ చెయ్యండి, అప్పుడే సత్యమైన సేవాధారి అని అంటారు.
స్లొగన్: సేవద్వారా సర్వుల ఆశీర్వాదములను ప్రాప్తి చేసుకోవటము - ఇదే ముందుకు వెళ్ళేందుకు లిఫ్ట్.
No comments:
Post a Comment