"మధురమైన పిల్లలూ - దు:ఖాన్ని హరించే తండ్రి మనల్ని సుఖధామములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు, మనం స్వర్గపు దేవతలుగా అవ్వనున్నాము అని మీకు ఎంతో సంతోషము ఉమాలి."
ప్రశ్న: పిల్లల ఏ స్థితిని చూస్తూ బాబాకు చింత కలుగదు, ఎందుకు కలుగదు?
జవాబు: కొందరు పిల్లలు ఫస్ట్ క్లాస్ అయిన సుగంధమయమైన పుష్పాలుగా ఉన్నారు, మరికొందరిలో కొద్దిగా కూడా సుగంధం ఉండదు, కొందరి స్థితి చాలా బాగా ఉంటుంది, కొందరు మాయ తుఫానులలొ ఓడిపోతారు. ఇవన్నీ చూస్తూ కూడా బాబాకు చింత కలుగదు, ఎందుకంటే ఇక్కడ సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతోందని బాబాకు తెలుసు. అయినా కానీ - పిల్లలూ, ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి, మాయ తుఫానులకు భయపడకండి అని బాబా శిక్షణను ఇస్తారు.
ధారణ:
1. ఈ కనులతో అన్నీ చూస్తూ కూడా వీటిని మరచిపోయే అభ్యాసమును చేయాలి, పాత ఇంటి నుండి, ప్రపంచం నుండి మనస్సును తొలగించుకోవాలి, కొత్త ఇంటిని స్మృతిచేయాలి.
2. జ్ఞాన స్నానం చేసి సుందరమైన దేవతలుగా అవ్వాలి. ఏ విధంగా తండ్రి సుందరముగా తెల్లని యాత్రికునిగా ఉన్నారో అలా వారి స్మృతి ద్వారా ఆత్మను నలుపు నుండి తెలుపుగా చేసుకోవాలి. మాయ యుధ్ధాన్ని చూసి భయపడకూడదు, విజయులుగా అయి చూపించాలి.
వరదానము: శుభభావన, శుభకామనల సహయోగముతో ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ.
ఎప్పుడైనా ఏ కార్యములోనైనా సర్వబ్రాహ్మణ పిల్లలు సంగఠిత రూపములో తమ మనస్సు యొక్క శుభభావనలు మరియు శూభ కామనల సహయోగమునిచ్చినట్లయితే ఈ సహయొగము ద్వారా వాయుమండలపు కోట తయారవుతుంది, ఇది ఆత్మలను పరివర్తన చేసేస్తుంది. ఏ విధంగా చేతి అయిదువేళ్ళ సహయోగముతో ఎంత పెద్ద కార్యమైనా సహజమైపోతుందో అలా బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి సహయొగము సేవలను సఫలతా సంపన్నంగా తయారుచేస్తుంది. సహయోగమునకు రిజల్టు సఫలత.
స్లొగన్: అడుగు అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకొనేవారే అందరికంటే పెద్ద ధనవంతులు.
No comments:
Post a Comment