Thursday, August 27, 2009

అశాంతికి కారణము ఏమిటి? మరి దాని నివారణ ఏమిటి?

"మధురమైన పిల్లలూ - పవిత్రత మీ నిజ సంస్కారము, మీరు రావణుని సాంగత్యములోకి వచ్చి పతితులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పావునులుగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి."

ప్రశ్న: అశాంతికి కారణము ఏమిటి? మరి దాని నివారణ ఏమిటి?

జవాబు: అపవిత్రతయే అశాంతికి కారణము. ఇప్పుడు భగవంతుడైన తండ్రితో - మేము పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచాన్ని తయారుచేస్తాము, మేము శుద్ధమైన దృష్టిని ఉంచుతాము, అశుద్ధముగా అవ్వము అని ప్రతిజ్ఞ చేయండి, అప్పుడు అశాంతి దూరమవ్వగలదు. శాంతి స్థాపన కొరకు నిమిత్తముగా అయిన పిల్లలైన మీరు ఎప్పుడూ అశాంతిని వ్యాపింపచేయజాలరు. మీరు శాంతిగా ఉండాలి, మాయకు దాసులుగా అవ్వకూడదు.

ధారణ:
1. బాబాతో పవిత్రతా ప్రతిజ్ఞను చేసారు, కావున స్వయాన్ని మాయ నుండి రక్షించుకుంటూ ఉండాలి, ఎప్పుడూ మాయకు దాసులుగా అవ్వకూడదు, ఈ ప్రతిజ్ఞను మరిచిపోకూడదు ఎందుకంటే ఇప్పుడిక పావన ప్రపంచములోకి వెళ్ళాలి.

2. దేవతలుగా అయ్యేందుకు మీ స్థితిని చాలా, చాలా శాంతచిత్తముగా చేసుకోవాలి, ఎటువంటి భూతమును ప్రవేశించనీయకూడదు, దైవీ గుణాలను ధారణ చేయాలి.

వరదానము: సేవా భావముతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళే మరియు ముందుకు తీసుకువెళ్ళే నిర్విఘ్న సేవాధారీ భవ.

సేవాభవము సఫలతను ప్రాప్తింపచేస్తుంది, సేవలో ఒకవేళ అహంభావము వచ్చినట్లయితే దానిని సేవాభావమని అనరు. ఏ సేవలోనైనా ఒకవేళ అహంభావము కలిసినట్లయితే కష్టము ఎక్కువ అవుతుంది, సమయముకూడా ఎక్కువ పడుతుంది మరియు స్వయం సంతుష్టులుగా కూడా ఉండరు. సేవాభావముకల పిల్లలు స్వయముకూడా ముందుకు వెళ్తారు మరియు ఇతరులను కూడా ముందుకు వెళ్ళనిస్తారు. వారు సదా ఎగిరే కళను అనుభవము చేసుకుంటారు. వారి ఉల్లాస-ఉత్సాహాలు స్వయమును నిర్విఘ్నముగా తయారుచేస్తాయి మరియు ఇతరుల కల్యాణమును చేస్తాయి.

స్లొగన్: ఎవరైతే చాలా సూక్ష్మమైన మరియు ఆకర్షణ కలిగించే దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో వారే జ్ఞానీ ఆత్మలు.

No comments:

Post a Comment