Saturday, August 29, 2009

బ్రాహ్మణులైన మీరు ఏ మాటలను ఎప్పుడూ మాట్లాడజాలరు?

"మధురమైన పిల్లలూ - మీలో ఎవరైతే మొత్తం విశ్వమంతటి సేవను చేస్తారో మరియు అనేకులను తమ సమానంగా తయారుచేస్తారో, బద్దకస్తులుగా ఉండరో వారే నిజాయితీపరులు."

ప్రశ్న: బ్రాహ్మణులైన మీరు ఏ మాటలను ఎప్పుడూ మాట్లాడజాలరు?

జవాబు: మాకు బ్రహ్మబాబాతో ఎటువంటి సంబంధమూ లేదు, మేము డైరెక్ట్ గా శివబాబానే స్మృతిచేస్తాము అని బ్రాహ్మణులైన మీరు ఎప్పుడూ అనరు. బ్రహ్మబాబా లేకుండా బ్రాహ్మణులుగా పిలువబడలేరు. ఎవరికైతే బ్రహ్మతో సంబంధం ఉండదో అనగా ఎవరైతే బ్రహ్మముఖవంశావళులు కారో వారు శూద్రులే అవుతారు. శూద్రులు ఎప్పుడూ దేవతలుగా అవ్వజాలరు.

ధారణ:
1. కొత్త, కొత్త సెంటర్లను వృద్ధి చేసేందుకు మీ సమానంగా తయారుచేసే సేవను చేయాలి. సెంటర్లు తెరుస్తూ ఉండాలి, ఒకేచోట కూర్చుండిపోకూడదు.

2. పూదోటను తయారుచేయాలి. ప్రతి ఒక్కరూ పుష్పముగా తయారై ఇతరులను కూడా మీ సమానంగా పుష్పాలుగా తయారుచేయాలి, ఏ సేవలోనూ దేహాభిమానం రాకూడదు.

వరదానము: జ్ఞానపు శ్రేష్ట ఖజానాను మహాదానిగా అయ్యి దానము చేసే మాస్టర్ జ్ఞాన సాగర భవ.

తండ్రి ఏవిధంగా జ్ఞానసాగరులో అలా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యి సదా ఇతరులకు జ్ఞాన దానమును ఇస్తూ ఉండండి. పిల్లలైన మీ వద్ధ ఎంత పెద్ద జ్ఞాన ఖజానా ఉంది! ఆ ఖజానాతో నిండుగా అయ్యి స్మృతి అనుభవాలతో ఇతరుల సేవను చెయ్యండి. ఏ ఖజానాలైతే లభించాయో వాటిని మహాదానులుగా అయ్యి దానము చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ఖజానాలు ఎంతగా దానము చేస్తూ ఉంటారో అంతగా ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మహాదానిగా అవ్వటము అనగా ఇవ్వటమే కాదు, ఇంకా నింపుకోవటము.

స్లొగన్: జీవన్ముక్తులుగా అవ్వడంతోపాటు దేహము నుండి అతీతమైన విదేహీగా అవ్వటము - ఇదే పురుషార్ధపు చివరి స్థితి.

No comments:

Post a Comment