"మధురమైన పిల్లలూ - మాయని వశం చేసుకునే మంత్రం మన్మనాభవ. ఈ మంత్రంతోనే అన్ని విశేషతలు ఇమిడి ఉన్నాయి. ఈ మంత్రమే మిమ్మల్ని పవిత్రంగ తయారు చేస్తుంది."
ప్రశ్న: ఆత్మ సురక్షితంగ ఉండడానికి నెంబర్ 1 సాధనం ఏమిటి మరియు ఏవిధంగ?
జవాబు: స్మృతి యొక్క యాత్ర నెంబర్ 1 సురక్షితకు సాధనం. ఎందుకనగా ఈ స్మృతి ద్వరానే మీ నడవడిక మారుతుంది. మీరు మాయ పైన విజయం సాధిస్తారు. స్మృతి ద్వారా పతీత కర్మేంద్రియాలు శాంతగ అవుతాయి. స్మృతిద్వారానే శక్తి వస్తుంది. జ్ఞానం అనే కత్తితో స్మృతి అనే పదును అవసరం. స్మృతి ద్వారానే మధురంగ సత్వ ప్రధానంగ తయారవుతారు. ఎవరిని కూడా బాధ పెట్టరు. అందుకని స్మృతియాత్రలో బలహీనంగా కాకూడదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మేము ఎంత వరకు స్మృతిలో ఉంటున్నాము అని.
ధారణ:
1. ఎవరూ భాధపడకుండా ఉండే వాతావరణాన్ని తయారు చేయాలి. బాబా సమానంగ విధేహీ అవ్వడానికి పురుషార్ధం చేయాలి. స్మృతి బలం ద్వార తమ స్వభావము మధురంగ మరియు కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి.
2. ఎల్లప్పుడూ ఇదే నషాలో ఉండాలి. ఇప్పుడు మేము సంగమయుగంలో ఉన్నాము. కలియుగంలో కాదు. బాబా మనల్ని కొత్త విశ్వానికి యజమానిగ తయారు చేయడానికి చదివిస్తున్నారు. అశుద్ధమైన ఆలోచనలను సమాప్తం చేయాలి.
వరదానం: బలహీనత నుండి శక్తిశాలిగ అయ్యి అసంభవాన్ని సమాప్తం చేసేటటువంటి ధైర్యవంతులయిన ఆత్మగ అవుతారు.
ధైర్యంగా ఉండే పిల్లలకు తండ్రి సహయోగం లభిస్తుంది. ఈ వరదానం యొక్క ఆధారం పై ధైర్యం యొక్క మొదటి దృఢ సంకల్పం చేశారు - మేము పవిత్రంగ అవ్వాల్సిందే మరియు బాబా పదములరెట్లు సహయోగము ఇచ్చారు. ఆత్మలైన మీరు అనాది, ఆది పవిత్రంగ ఉన్నారు. అనేక సార్లు పవిత్రంగ అయ్యారు, ఇంకా అవుతూ ఉంటారు. అనేకసార్లు యొక్క స్మృతి ద్వారా సమర్ధంగ అయ్యారు. బలహీనత నుండి ఎంత శక్తిశలిగ అయ్యారు అంటే ఏదైతే చాలెంజ్ చేస్తారో విశ్వాన్ని కూడా పావనంగ తయారు చేసి చూస్తాము. ఎవరిదైతే ఋషి మునులు మహాన్ ఆత్మలు అని అనుకుంటారో వారు ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగ ఉండడం కష్టం. దానినే మీరు అతి సహజం అంటారు.
స్లొగన్: దృఢమైన సంకల్పం చెయ్యడమే వ్రతం తీసుకోవడం. సత్యమైన భక్తులు ఎప్పుడు కూడా ఆ సమయాన్ని తెంచుకోరు.
No comments:
Post a Comment