"మధురమైన పిల్లలూ - యోగబలం ద్వారా చెడుసంస్కారాలను పరివర్తన చేసుకుని స్వయానికి మంచి సంస్కారాలు అలవాటు చేసుకోండి. జ్ఞానం మరియు పవిత్రత యొక్క సంస్కారం మంచి సంస్కారము."
ప్రశ్న: పిల్లలైన మీది జన్మసిద్ధ అధికారం ఏముంది? మీకు ఇప్పుడు ఎటువంటి వాటి అనుభవం వస్తుంది?
జవాబు: మీ జన్మసిద్ధి అధికారం ముక్తి మరియు జీవన్ముక్తి. ఇప్పుడు మనకు ఆ అనుభవం వస్తుంది. మేము ఇప్పుడు బాబాతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. బాబా వచ్చారు భక్తి యొక్క ప్రతిఫలం ముక్తి మరియు జీవన్ముక్తి ఇవ్వడానికి ఇప్పుడు అందరూ శాంతిధామానికి వెళ్ళాలి. అందరూ తమ ఇంటిని సాక్షాత్కారం చేసుకోవాలి.
ధారణ:
ముక్తి, జీవన్ముక్తి శివ పరమాత్మ మనకు ఇచ్చిన జన్మ సిద్ధి అధికారము. చెడు సంస్కారాలన్నీ యొగబలం ద్వారా మంచి సంస్కారాలుగ పరివర్తన చెందుతాయి. బాబా పిల్లలను చదివించి 21 జన్మల వరకు వారసత్వం ఇస్తున్నారు. మనసా వాచా కర్మణా పవిత్రత ఉండాలి.
1. అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోవడం కొరకు మనసావాచా కర్మణా పవిత్రం గా తప్పకుండా అవ్వాలి. మంచి సంస్కారాలు యోగ బలంతో ధారణ చేయాలి. స్వయాన్ని గుణవంతులుగ తయారుచేసుకోవాలి.
2. ఎల్లప్పుడూ సంతోషంగ ఉండడం కొరకు బాబా రోజూ వినిపించే గుహ్యమైన విషయాలని మనం వినాలి మరియు ఇతరులకు కూడా వినిపించాలి. ఏ విషయంలో కూడా సంశయంలోనికి రాకూడదు. యుక్తితో జవాబు ఇవ్వాలి. సిగ్గుపడకూడదు.
వరదానం:
ప్రతి క్షణం యొక్క ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని జమా ఖాతాను నిండుగా చేసే వారే సమర్ధ ఆత్మలు.
సంగమ యుగంలో అవినాశీ బాబా ద్వారా ప్రతి సమయం అవినాశీ ప్రాప్తులు అవుతాయి. మొత్తం కల్పంలో ఇటువంటి ధ్యానం ప్రాప్తి చేసుకోవడానికి ఇదే సమయం. అందుకని మన స్లోగన్ ఉంది ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు. ఏదైనా శ్రేష్టకార్యం చేసేది ఉంటే అది ఇప్పుడే చెయ్యండి. ఈ స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా సమయం, సంకల్పము లేక కర్మ వ్యర్ధం కాదు. సమర్ధ సంకల్పాలతో జన్మ యొక్క ఖాతా మరియు ఆత్మ సమర్ధం గ తయారవుతుంది.
స్లొగన్: ప్రతీ మాట ప్రతీ కర్మ యొక్క అలౌకికతయే పవిత్రత. సాధారణతని అలౌకికత లోకి పరివర్తన చేయండి.
No comments:
Post a Comment