తెలుగు మురళి 4-9-2009
మధురమైన పిల్లలూ - మీరు బాబా దగ్గరకు మీ నడవడికను బాగుచేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు మీది దైవీ నడవడికగా తయారుచేసుకోవాలి.
ప్రశ్న: పిల్లలైన మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎందువల్ల అంగీకరించబడదు?
జవాబు: ఎందుకంటే కేవలం దృష్టి ద్వారా పరివర్తన చేసే తండ్రి స్వయం మీ ముందు ఉన్నారు. ఒకవేళ కళ్ళుమూసుకొని ఉన్నట్లైతే బాబా ఎలా దృష్టిని ఇస్తారు? స్కూలులో కళ్ళుమూసుకొని కూర్చోకూడదు. కళ్ళు మూసుకున్నట్లైతే బద్ధకం వస్తుంది. పిల్లలైన మీరు స్కూల్ లో చదువుకుంటున్నారు. ఇది మీ సంపాదనకు ఆధారం. లక్షల పదమాల సంపాదన ఇందులో జరుగుతుంది. సంపాదనలో బద్ధకం, ఉదాసీనత రాజాలదు.
ఓంశాంతి.
ధారణకొరకు ముఖ్యసారము:
1. బాబాలో ఏ నడవడిక అయితే ఉంటుందో దానినే ధారణ చేయాలి. తండ్రి సమానంగా ఙ్ఞానసాగరులుగా అవ్వాలి. దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి.
2. ఆత్మరూపీ బ్యాటరీని సతోప్రధానంగా తయారుచేసేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతియాత్రలో ఉండాలి. దైవీ నడవడికను ధారణ చేయాలి, చాలా చాలా మధురంగా తయారుకావాలి.
వరదానం: విజయం నిశ్చితమనే నషాలో ఉంటూ బాబా యొక్క పదమారెట్ల సహయోగం ప్రాప్తిచేసుకునే మాయాజీత్ భవ.
స్లోగన్: సంకల్ప శక్తిని జమచేసుకొని స్వయం పట్ల మరియు విశ్వం పట్ల దాని ప్రయోగం చేయండి.
No comments:
Post a Comment