"మధురమైన పిల్లలూ - ఇది అనంతమైన విశాలమైన స్టేజి, ఇందులో ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు బంధింపబడి ఉన్నారు, ఇందులో ప్రతి ఒక్కరికీ నిర్ణీతమైన పాత్ర ఉంది."
ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తించుకునేందుకు పురుషార్ధము ఏమిటి?
జవాబు: కర్మాతీతముగా అవ్వాలంటే పూర్తిగా సరెండర్ అవ్వవలసి ఉంటుంది. మీదంటూ ఏదీ ఉండకూడదు. ఎప్పుడైతే అన్నింటినీ మరచిపోయి ఉంటారో అప్పుడే కర్మాతీతముగా అవ్వగలుగుతారు. ఎవరికైతే ధనము, సంపద, పిల్లలు మొదలైనవారు గుర్తుకువస్తూ ఉంటారో వారు కర్మాతీతముగా అవ్వలేరు, కావుననే బాబా, నేను పేదలపాలిటి పెన్నిధిని అని అంటారు. పేద పిల్లలు త్వరగా సరెండర్ అయిపోతారు, సహజముగానే అన్నింటినీ మరచిపోయి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలుగుతారు.
ధారణ:
1. ఏ విధంగా బాబా ప్రేమసాగరులో అలా మాస్టర్ ప్రేమసాగరులుగా అయి ప్రేమతో పని నడపాలి, క్రోధం చేయకూడదు, ఎవరైనా క్రోధం చేస్తే మీరు శాంతిగా ఉండాలి.
2. బుద్ధి ద్వారా ఈ పాత దు:ఖమయమైన ప్రపంచాన్ని మరచి అనంతమైన సన్యాసిగా అవ్వాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిచేయాలి, అవినాశీ జ్ఞానరత్నాలను ఇచ్చిపుచ్చుకోవాలి.
వరదానము: సర్వ ప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపులై కార్యములో వినియోగించే సదా సంతుష్ట ఆత్మాభవ.
సంగమయుగపు విశేష వరదానము - సంతుష్టత మరియు సంతుష్టతకు బీజము సర్వప్రాప్తులు. అసంతుష్టతకు బీజము స్థూల మరియు సూక్ష్మ అప్రాప్తులు. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు అన్నది బ్రాహ్మణుల గాయనము. పిల్లలందరికీ ఒక్కరిద్వారా ఒకేవిధమైన తరగని ఖజానా లభిస్తుంది. కేవలము ప్రాప్తించిన ఆ ఖజానాలను అన్నివేళలా కార్యములో వినియోగించండి, అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. అనంతమైన ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చెయ్యనట్లయితే సదా సంతుష్టం గా ఉంటారు.
స్లొగన్: ఎక్కడైతే నిశ్చయము ఉంటుందో అక్కడ విజయపు భాగ్య రేఖ మస్తకముపై ఉండనే ఉంటుంది.
No comments:
Post a Comment