Thursday, August 12, 2010

నిర్వికారీ శక్తి ద్వారా సూక్ష్మవతనము లేక మూడు లోకాలను అనుభవం చేసుకునే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ

మధురమైన పిల్లలూ – మిమ్మల్ని ఎవరు చదివించడానికి వచ్చారో ఒక్కసారి ఆలోచిస్తే, సంతోషములో మీ రోమరోమాలు లకరించిపోతాయి, ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు, ఇటువ్మటి చదువును ఎప్పుడూ వదలకూడదు."

ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీకు ఏ నిశ్చయము ఏర్పడింది? నిశ్చయబుద్ధి కలవారి గుర్తులు ఏమిటి?

జవాబు: ఏ చదువు ద్వారా ద్వికిరీటధారులుగా, రాజులకు రాజులుగా అవుతారో ఆ చదువును ఇప్పుడు చదువుకుంటున్నాము. స్వయముగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తూ విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు, ఇప్పుడు వారి సంతానంగా అయ్యము కాబట్టి ఇక ఈ చదువులో నిమగ్నమైపోవాలి అన్న నిశ్చయము పిల్లలైన మీలో ఉంది ఏ విధముగా చిన్నపిల్లలు తమ తల్లితండ్రుల వద్దకు తప్ప ఇంకెవ్వరి వద్దకు వెళ్ళరో అదేవిధంగా అనంతమైన తండ్రి లభించాక ఇంకేదీ నచ్చకూడదు. ఒక్కరి స్మృతి మాత్రమే ఉండాలి.

ధారణ:
1. స్వయముగా భగవంతుడే సుప్రీం టీచర్ గా అయి చదివిస్తున్నారు కావున బాగా చదవాలి, వారి మతముపైనే నడవాలి.

2. సైలెన్స్ శక్తి జమ అయ్యే విధముగా బాబాతో యోగమును జోడించాలి. సైలెన్స్ శక్తి ద్వారా విశ్వముపై విజయాన్ని పొందాలి, పతితుల నుండి పావనులుగా అవ్వాలి.

వరదానము: నిర్వికారీ శక్తి ద్వారా సూక్ష్మవతనము లేక మూడు లోకాలను అనుభవం చేసుకునే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ.ఏ పిల్లలవద్దనైతే నిర్వాకారీ శక్తి ఉంటుందో, ఎవరి బుద్ధి యోగమైతే పూర్తిగా రెఫైండ్ గా ఉంటుందో అటువంటి భాగ్యవంతులైన పిల్లలు సహజముగానే మూడులోకాలను చుట్టిరాగలరు. సూక్ష్మవతనం వరకు తమ సంకల్పాలను చేర్చేందుకు సర్వసంబంధాల సారముగల సూక్ష్మమైన స్మృతి కావాలి. ఇదే శక్తిశాలీ సంబంధము. ఇందులో మధ్యమధ్యలో మాయ కల్పించుకోజాలదు. కావున సూక్ష్మవతనపు శోభను అనుభవం చేసుకునేందుకు స్వయమును నిర్వికార శక్తితో సంపన్నంగా చేసుకోండి.

స్లొగన్: ఏ వ్యక్తి, వస్తువు లేక వైభవంపట్లనైనా ఆకర్షితమవ్వడమే జీవితభాగస్వామి అయిన బాబాకు సంకల్పము ద్వారా విడాకులివ్వడము.

No comments:

Post a Comment